చైతన్య, సాయిపల్లవి ‘లవ్‌స్టోరీ’ సాంగ్‌ అదుర్స్‌
close
Published : 11/03/2020 17:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చైతన్య, సాయిపల్లవి ‘లవ్‌స్టోరీ’ సాంగ్‌ అదుర్స్‌

‘ఏ పిల్లా పరుగున పోదామా..’

హైదరాబాద్‌: అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి ప్రేమలోకంలో విహరిస్తున్నారు. వీరిద్దరు జంటగా నటిస్తున్న సినిమా ‘లవ్‌స్టోరీ’. శేఖర్‌ కమ్ముల దర్శకుడు. ఈ సినిమాలోని ‘ఏ పిల్లా పరుగున పోదామా.. ఏ వైపో జంటగ ఉందామా.. రారా కంచే దూకి చకచక ఉరుకుతు..’ అని సాగే గీతాన్ని విడుదల చేశారు. పాటకు పవన్‌ సీహెచ్‌ చక్కటి సంగీతం అందించారు. హరి చరణ్‌, నకుల్‌ అభ్యంకర్‌ ఆలపించారు. చైతన్య, సాయి పల్లవిపై ఈ పాటను చిత్రీకరించారు. ఇద్దరు సాధారణ మధ్య తరగతికి చెందిన అమ్మాయి, అబ్బాయిగా కనిపించారు. వీరి కెమిస్ట్రీ, ట్యూన్స్‌ యూట్యూబ్‌లో శ్రోతల్ని ఆకట్టుకుంటున్నాయి.

‘ఫిదా’ తర్వాత శేఖర్‌ కమ్ముల తెరకెక్కిస్తున్న సినిమా ఇది. రావు రమేశ్‌, పోసాని కృష్ణమురళీ కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ సంస్థ నిర్మిస్తోంది. ఏప్రిల్‌ 2న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘వెంకీ మామ’తో ఇటీవల హిట్‌ అందుకున్న నాగచైతన్య ఈ సినిమా తర్వాత పరుశురాం దర్శకత్వంలో నటించబోతున్నారు. సాయిపల్లవి ‘విరాటపర్వం 1922’లో కనిపించనున్నారు.




మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని