కరోనా: ‘మేజర్‌’ అప్‌డేట్స్‌ వాయిదా
close
Published : 15/03/2020 20:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా: ‘మేజర్‌’ అప్‌డేట్స్‌ వాయిదా

కొత్త సినిమా గురించి అడివిశేష్‌ ట్వీట్‌

హైదరాబాద్‌: టాలీవుడ్‌ నటుడు అడివిశేష్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మేజర్‌’. మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆదివారం సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని అడివి శేష్‌ ట్విటర్‌ వేదికగా ‘మేజర్‌’ సినిమా గురించి ఓ కీలకమైన ట్వీట్‌ చేశారు. ‘మేజర్‌’కు సంబంధించిన అతిముఖ్యమైన అప్‌డేట్‌ను నేడు చిత్రబృందం ప్రకటించాలనుకుందని, కాకపోతే కరోనా కారణంగా దానిని ఇప్పుడు ప్రకటించలేకపోతున్నామని ఆయన తెలిపారు.

‘నేడు మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జయంతి. ఇది మా ‘మేజర్‌’ చిత్ర బృందానికే కాకుండా మన దేశం మొత్తానికి చాలా ముఖ్యమైన రోజు. ఆయన జీవితం, ఆయన చేసిన త్యాగాలు నాకు ఎన్నో విలువలు నేర్పించాయి. అలాగే నాలో స్ఫూర్తి నింపాయి. ఆయన జయంతి సందర్భంగా ‘మేజర్‌’ సినిమాకు సంబంధించిన చాలా కీలకమైన విషయాన్ని నేడు విడుదల చేయాలని భావించాం. కాకపోతే కొవిడ్‌ 19(కరోనా వైరస్‌) కారణంగా మేము మా ప్రణాళికలను మార్చుకున్నాం. త్వరలో కొత్త అప్‌డేట్స్‌ను తెలియచేస్తాం. లవ్‌ యూ ఆల్‌. అందరూ జాగ్రత్తగా ఉండండి. మన సైనికుల త్యాగాలను మర్చిపోకండి. జైహింద్‌’ అని అడివి శేష్‌ ట్వీట్‌ చేశారు.

గతేడాది విడుదలైన ‘ఎవరు’ సినిమా తర్వాత అడివి శేష్‌ నటిస్తున్న చిత్రమిది. ‘మేజర్‌’ చిత్రానికి శశికిరణ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అడివి శేష్‌ కథానాయకుడిగా నటించిన ‘గూఢచారి’ సినిమాకు కూడా శశికిరణే దర్శకత్వం వహించారు. అలాగే ఈ చిత్రాన్ని జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు నిర్మిస్తున్నారు.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని