కరోనా సమయంలోనూ ప్రభాస్‌ టీం సాహసం
close
Updated : 17/03/2020 13:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా సమయంలోనూ ప్రభాస్‌ టీం సాహసం

ఎట్టకేలకు జార్జియా షెడ్యూల్‌ పూర్తి

హైదరాబాద్‌: యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ తర్వాతి చిత్రం మరో షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ‘సాహో’ తర్వాత ఆయన తన 20వ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మూడు షెడ్యూళ్లు పూర్తయ్యాయి. దీంతోపాటు ఓ ఛేజింగ్‌ సన్నివేశాన్ని కూడా చిత్రీకరించారు. కాగా, కొన్ని రోజుల క్రితం యూనిట్‌ ఈ చిత్రం షూటింగ్‌ కోసం జార్జియా వెళ్లారు. కరోనా వైరస్‌ ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న నేపథ్యంలోనూ ముందడుగు వేశారు. ‘10 డిగ్రీల చలి.. ఓ పక్క వర్షం పడుతోంది.. మరోపక్క కరోనా వైరస్‌ ముప్పు.. ఇవేవీ యూనిట్‌ విశ్వాసాన్ని ఆపలేకపోయాయి’ అని నాలుగు రోజుల క్రితం రాధాకృష్ణ ట్వీట్‌ చేస్తూ ఫొటోను షేర్‌ చేశారు.

కాగా మంగళవారంతో ఎట్టకేలకు జార్జియా షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నామని రాధాకృష్ణ తెలిపారు. ‘కిక్కాస్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసేందుకు మాకు సహాయం చేసిన జార్జియాలోని సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు. మీరెంతో ప్రియమైన వారు. ప్రభాస్‌ ఫస్ట్‌లుక్‌ త్వరలోనే విడుదల కాబోతోంది’ అని ఆయన పేర్కొన్నారు.



మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని