నయనతార కోసం ‘రంగం’ విలన్‌
close
Published : 18/03/2020 22:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నయనతార కోసం ‘రంగం’ విలన్‌

చెన్నై: లేడీ సూపర్‌స్టార్‌ నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘నెట్రిక్కన్‌’లో మరో నటుడు చేరారు. ‘రంగం’, ‘అభినేత్రి 2’ తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న అజ్మల్‌ అమీర్‌ ఇందులో మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కు తెలిపారు. ‘‘నెట్రిక్కన్‌’ సినిమా రెండు ప్రధాన పాత్రల చుట్టూ తిరుగుతుంది. ఇందులో ఒక పాత్రను నయనతార పోషిస్తున్నారు. మరొకటి నేను చేస్తున్నా. ఇది ఎన్నో మలుపులున్న చిత్రం. దీని కోసం నైపుణ్యం ఉన్న సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. సినిమా ఔట్‌పుట్‌ చాలా బాగా వస్తుందనే నమ్మకం నాకుంది’’ అని చెప్పారు.

మిలింద్‌రావ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విఘ్నేశ్‌ శివన్‌ నిర్మిస్తున్నారు. కార్తిక్‌ గణేశ్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి గిరీష్‌ సంగీతం సమకూర్చుతున్నారు. ఇందులో నయన్‌ అంధురాలి పాత్రను పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘బ్లైండ్‌’ అనే కొరియన్‌ సినిమా ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నారని తెలిసింది. సీరియల్‌ కిల్లర్‌ కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తాత్కాలికంగా చిత్రీకరణను నిలిపివేశారు.



మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని