‘పాగల్‌’గా రానున్న విశ్వక్‌సేన్‌..!
close
Published : 19/03/2020 10:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘పాగల్‌’గా రానున్న విశ్వక్‌సేన్‌..!

హైదరాబాద్‌: ‘ఫలక్‌నుమా దాస్‌’ లాంటి మాస్‌ కథా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు నటుడు విశ్వక్‌సేన్‌. ఆయన కథానాయకుడిగా త్వరలో ఓ విభిన్నమైన ప్రేమకథా చిత్రం తెరకెక్కనుంది. ‘పాగల్‌’ అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా పూజా కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. పూజా కార్యక్రమం సందర్భంగా ‘పాగల్‌’ టైటిల్‌ పోస్టర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. నూతన దర్శకుడు నరేష్‌ కుప్పిలి డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాకు బెక్కం వేణుగోపాల్‌ నిర్మాతగా వ్యవహరించనున్నారు. విశ్వక్‌సేన్‌ ఐదో సినిమాగా ‘పాగల్‌’ రానుంది.

ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ‘హిట్’ చిత్రంలో విశ్వక్‌సేన్‌ నటించారు. శైలేష్‌ కొలను దర్శకత్వం వహించిన ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ ఫిబ్రవరి 28న విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంది. ఈ సినిమాలో విశ్వక్‌సేన్‌.. విక్రమ్‌ రుద్రరాజు అనే పోలీస్‌ అధికారి పాత్రలో మెప్పించారు. వాల్‌ పోస్టర్‌ సినిమా బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి నాని నిర్మాతగా వ్యవహరించారు.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని