‘ఆచార్య’లో చరణ్‌ కూడా భాగమే..!
close
Published : 21/03/2020 17:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆచార్య’లో చరణ్‌ కూడా భాగమే..!

ఆ వార్తలన్నీ అవాస్తవం

హైదరాబాద్‌: ‘ఆచార్య’ సినీ నిర్మాణంలో రామ్‌చరణ్‌ కూడా భాగమేనని ఆ చిత్ర మరో నిర్మాత నిరంజన్‌ రెడ్డి తెలిపారు. మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో కనిపించనున్న ‘ఆచార్య’ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. చిరు 152వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిరంజన్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే గత కొన్నిరోజుల నుంచి రామ్‌చరణ్‌ ‘ఆచార్య’ సినిమా నిర్మాణ పనుల్లో సరిగ్గా పాలుపంచుకోవడం లేదంటూ పలు వెబ్‌సైట్లలో వార్తలు వస్తోన్నాయి. ఈ నేపథ్యంలో ‘ఆచార్య’ సినిమా నిర్మాత నిరంజన్‌ రెడ్డి సదరు వార్తలపై స్పందించారు. రామ్‌చరణ్‌ గురించి వస్తోన్న వార్తల్లో ఎంతమాత్రం నిజంలేదని ఆయన పేర్కొన్నారు.

‘చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రానికి కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, రామ్‌చరణ్‌ నిర్మాతగా ఎలాంటి సహకారం అందించడం లేదంటూ వస్తోన్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు. ఆ వార్తలన్ని అవాస్తవం. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీతోపాటు రామ్‌చరణ్‌ కూడా చిత్ర నిర్మాణ విషయాల్లో పూర్తిగా భాగమయ్యారు. అలాగే చిత్ర నిర్మాణాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా చిత్ర నిర్మాణంలో భాగమయ్యాం. నిజం చెప్పాలంటే ఇరు సంస్థలు చిత్ర నిర్మాణం విషయంలో పరస్పర విధులు, బాధ్యతలను పంచుకున్నాం. దాని ప్రకారమే సినిమా నిర్మాణం చేపడతాం.’ అని నిరంజన్‌ రెడ్డి తెలిపారు.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని