close
Published : 23/03/2020 08:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మరోసారి ‘ఖైదీ నంబర్‌ 150’ జోడీ

అగ్ర కథానాయకుడు చిరంజీవితో కలిసి మరోసారి నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది కాజల్‌ అగర్వాల్‌. వీళ్లిద్దరూ ఇదివరకు ‘ఖైదీ నంబర్‌ 150’లో జోడీ కట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ తెరకెక్కుతోంది. ఇందులో నాయికగా మొదట త్రిష ఎంపికైంది. అయితే ఆమె ఇటీవల సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. దాంతో అనుష్కతో పాటు పలువురు నాయికల పేర్లు వినిపించాయి. తాజాగా ‘ఆచార్య’ బృందం కాజల్‌ని ఖాయం చేసింది. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తారు. ఆయన సరసన నటించే కథానాయిక కోసం ప్రస్తుతం కసరత్తులు జరుగుతున్నాయి.


Tags :

మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని