‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ అప్‌డేట్‌.. ఉగాది నాడే..!
close
Published : 24/03/2020 19:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ అప్‌డేట్‌.. ఉగాది నాడే..!

ప్రకటించిన రాజమౌళి

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమా అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను బుధవారం విడుదల చేయబోతున్నట్లు జక్కన్న ప్రకటించారు. ‘నా మొత్తం చిత్ర బృందం తరఫున అభిమానులు, ప్రేక్షకుల్ని నేను కోరుతున్నా.. ఇంట్లోనే ఎంజాయ్‌ చేయండి. అందరం కలిసేందుకు కారణం లేదు కాబట్టే.. ఈ దేశమంతా లాక్‌డౌన్‌లో ఉంది. ప్రపంచం సంక్షోభం ఎదుర్కొంటోన్న తరుణం ఇది. ఈ సమయంలో ప్రతి ఒక్కరి స్ఫూర్తిని మేలుకొలిపేందుకు మా వంతు ప్రయత్నం చేయాలి అనుకున్నాం. బుధవారం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేయబోతున్నాం. ఫలానా సమయానికి విడుదల చేస్తామని నేను చెప్పలేను. ఎందుకంటే.. మా బృందం వాళ్ల వాళ్ల ఇంటి నుంచి పనిచేస్తున్నారు. మీ నివాసాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆన్‌లైన్‌లో ఉండండి.. థ్రిల్‌ అవ్వండి. పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని కోరుతున్నా’ అని జక్కన్న ట్వీట్లు చేశారు. దీంతోపాటు ఓ ప్రత్యేక పోస్టర్‌ను పంచుకున్నారు. అందులో నిప్పు, నీరు ఉన్న చేతుల్ని చూపించారు.

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌, కొమరం భీమ్‌గా ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. దానయ్య నిర్మాత. అలియా భట్‌, ఒలీవియా మోరిస్‌ కథానాయికలు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాపై విశేషమైన అంచనాలు ఉన్నాయి.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని