ఆర్‌.ఆర్‌.ఆర్‌. పోస్టర్‌.. చిరు, వర్మ ఏమన్నారంటే?
close
Published : 25/03/2020 14:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆర్‌.ఆర్‌.ఆర్‌. పోస్టర్‌.. చిరు, వర్మ ఏమన్నారంటే?

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తన స్నేహితుడు, దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళికి ధన్యవాదాలు తెలిపారు. జక్కన్న తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా నటిస్తున్నారు. దానయ్య నిర్మాత. అలియా భట్‌, ఒలీవియా మోరిస్‌ కథానాయికలు. ఈ సినిమా టైటిల్‌ లోగో మోషన్‌ పోస్టర్‌ను బుధవారం మధ్యాహ్నం విడుదల చేశారు. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ అంటే ‘రౌద్రం, రణం, రుధిరం’ అని తెలిపారు. దీంతోపాటు చరణ్‌, తారక్‌ లుక్‌లను కాస్త రివీల్‌ చేశారు. కరోనాతో ప్రజలు పోరాడుతున్న ఈ తరుణంలో వారిలో కాస్త ఉత్సాహం నింపే ప్రయత్నంగా దీన్ని విడుదల చేసినట్లు రాజమౌళి వెల్లడించారు. ఈ ప్రచార చిత్రాన్ని చూసిన వర్మ, చిరంజీవి, వి.వి. వినాయక్‌, అఖిల్‌ తదితరులు ట్విటర్‌ వేదికగా స్పందించారు.

చిరంజీవి: ‘ఇప్పుడే ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ మోషన్‌ పోస్టర్‌ చూశా. కనువిందుగా ఉంది, నా ఒళ్లు గగుర్పొడిచింది. కీరవాణి అద్భుతమైన నేపథ్య సంగీతం అందించారు. రాజమౌళి, తారక్‌, చరణ్‌ పనితీరు అద్భుతంగా ఉంది. ఈ ఉగాది రోజున అందరిలో ఎనర్జీ నింపారు’ అని ట్వీట్‌ చేశారు. దీన్ని చూసిన జక్కన్న రిప్లై ఇచ్చారు. ‘సర్‌.. మీరు ప్రశంసించడం చాలా ఆనందంగా ఉంది. ఉగాది శుభాకాంక్షలు.. ట్విటర్‌కు స్వాగతం’ అని పోస్ట్‌ చేశారు. 

వర్మ: విరామం లేకుండా డిప్రెస్సింగ్‌ వార్తలు వస్తోన్న ఈ తరుణంలో జీవితంలో రాబోయే మంచి విషయాల కోసం ఎదురుచూడాలని మాకు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు రాజమౌళి. కొవిడ్‌-19లాంటి భయంకరమైన విషయాలు ఉన్నాయి, ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లాంటి గొప్ప విషయాలు కూడా ఉన్నాయి.

వి.వి. వినాయక్‌: బ్రిటిష్ ప్రభుత్వ పాలనపై కట్టలు తెంచుకున్న ‘రౌద్రం’. ఆ ఇద్దరు కలిసి చేయాలనుకున్న ‘రణం’. ఆ యుద్ధంలో వాళ్లు అర్పించిన ‘రుధిరం’.

అఖిల్‌: ఇది మన ఆత్మవిశ్వాన్ని పెంచింది. మోషన్‌ పోస్టర్‌ సూపర్‌గా ఉంది.

వరుణ్‌తేజ్‌: వావ్‌.. నిప్పు, నీరు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది.

 
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని