‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి మరో సర్‌ప్రైజ్‌
close
Published : 26/03/2020 20:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి మరో సర్‌ప్రైజ్‌

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘RRR’(రౌద్రం రణం రుధిరం). ఉగాది సందర్భంగా టైటిల్‌ లోగోతో పాటు, మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేసి, అభిమానుల్లో ఆసక్తి పెంచింది చిత్ర బృందం. శుక్రవారం రామ్‌చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా మరో సర్‌ప్రైజ్‌ను ఇవ్వబోతోంది. 

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశారు. ‘బ్రదర్‌ రామ్‌చరణ్‌. నీ పుట్టినరోజును ఘనంగా చేయాలని కోరుకున్నా. ప్రస్తుతం మనం లాక్‌డౌన్‌లో ఉన్నాం. ప్రస్తుతం ఇంట్లో ఉండటమే ముఖ్యం. అందుకే, రేపు 10 గంటలకు నీకు డిజిటల్‌ వేదికగా సర్‌ప్రైజ్‌ ఇస్తా. నన్ను నమ్ము ఇలాంటి సర్‌ప్రైజ్‌ను ఎప్పటికీ మర్చిపోలేవు’’ అని ట్వీట్‌ చేశారు.

దీనికి రామ్‌చరణ్‌ బదులిస్తా.. ‘వావ్‌.. సరైన సమయంలో నేను ట్విటర్‌లో చేరాను. లేకపోతే నువ్వు ఇచ్చే అద్భుతమైన సర్‌ప్రైజ్‌ను మిస్‌ అయ్యేవాడిని బ్రదర్‌. రేపటి వరకూ ఆగలేకపోతున్నా’’ అని సమాధానం ఇచ్చారు.

‘బీమ్‌ ఫర్‌ రామరాజు’ పేరుతో సర్‌ప్రైజ్‌ వీడియోను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. తెలుగు వీడియోను డీవీవీమూవీస్‌, తమిళ్‌ను జూ.ఎన్టీఆర్‌, హిందీ అజయ్‌దేవగణ్‌, కన్నడ వారాహి, మలయాళం రామ్‌చరణ్‌ల సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకోనున్నారు. 

తొలిసారి ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌ కలిసి ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమరంభీంగా ఎన్టీఆర్‌ కనిపించనున్నారు. చెర్రీకి జోడీగా ఆలియాభట్‌, ఎన్టీఆర్‌కు జంటగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌ సందడి చేయనున్నారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని  డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా  వచ్చే ఏడాది జనవరి 8న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోంది.

 




మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని