నితిన్‌ బర్త్‌డే కానుకగా ‘రంగ్‌దే’ ఫస్ట్‌లుక్‌
close
Published : 29/03/2020 17:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నితిన్‌ బర్త్‌డే కానుకగా ‘రంగ్‌దే’ ఫస్ట్‌లుక్‌

హైదరాబాద్‌: యువ కథానాయకుడు నితిన్‌ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు కానుక ఇచ్చారు. సోమవారం ఆయన బర్త్‌డేని పురస్కరించుకుని ‘రంగ్‌దే: గివ్‌ మి సమ్‌ లవ్‌’ ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో కథానాయిక కీర్తి సురేశ్‌, నితిన్‌ను చూపించారు. వారిద్దరూ అను, అర్జున్‌ పాత్రల్ని పోషిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రచార చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.

‘రంగ్‌దే’ సినిమాకు ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. నితిన్‌ ఇటీవల ‘భీష్మ’తో హిట్‌ అందుకున్నారు. మరోపక్క ఆయన హీరోగా చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. కృష్ణ చైతన్య దర్శకత్వంలోనూ నటించబోతున్నారట.




మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని