రాయణంగా విజయ్‌ సేతుపతి
close
Published : 01/04/2020 20:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాయణంగా విజయ్‌ సేతుపతి

మైత్రీ మూవీ మేకర్స్‌ ట్వీట్‌

హైదరాబాద్‌: కోలీవుడ్‌ ప్రముఖ నటుడు విజయ్‌సేతుపతి రాయణంగా మెప్పించనున్నారు. సాయిధరమ్‌ తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌తేజ్‌ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమవుతోన్న చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి ప్రతినాయకుడి పాత్రలో మెప్పించనున్నారు. అయితే ఈ సినిమాని వేసవి కానుకగా ఏప్రిల్‌ నెలలో విడుదల చేయాలని చిత్రబృందం భావించినప్పటికీ కరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా పలు చిత్రాల విడుదలను ఆయా చిత్రబృందాలు కొంతకాలంపాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా విడుదల వాయిదా పడడంతో తాజాగా ఈ సినిమా నుంచి విజయ్‌ సేతుపతి లుక్‌ను చిత్రబృందం బుధవారం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. ‘రాయణంగా విజయ్‌ సేతుపతి.. ఇళ్లలోనే ఉండండి.. జాగ్రత్తగా జీవించండి’ అని మైత్రీ మూవీ మేకర్స్‌ పేర్కొంది.

మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో వైష్ణవ్‌ తేజ్‌కు జంటగా కృతిశెట్టి నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పలు పోస్టర్లు, ‘నీ కన్ను నీలి సముద్రం’, ‘ధక్‌ ధక్‌ ధక్‌’ అనే పాటలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని