బన్ని అభిమానులకు సర్‌ప్రైజ్‌ రెడీ!
close
Published : 07/04/2020 09:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బన్ని అభిమానులకు సర్‌ప్రైజ్‌ రెడీ!

హైదరాబాద్‌: అల్లు అర్జున్‌ అభిమానులకు శుభవార్త. ఆయన కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి అప్‌డేట్‌ కోసం వేచి చూస్తున్న బన్ని అభిమానులకు త్వరలోనే ఓ సర్‌ప్రైజ్‌ రానుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ వెల్లడించింది. ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్‌ పుట్టిన రోజు సందర్భంగా అప్‌డేట్‌ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి చిత్తూరు యాసలో ఓ ఆసక్తికర ట్వీట్‌ చేసింది.

చూశారుగా.. ఇదే ఆ అప్‌డేట్‌. ఇక ఏప్రిల్‌ 8న ఉదయం 9గంటల కోసం అందరూ వేచి చూడండి. చిత్తూరు ప్రాంతంలో సాగే ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారని సమాచారం. బన్ని ఇందులో రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నారని ఇటీవలే వార్తలొచ్చాయి. అంతేకాదు, ఆయన లుక్‌, స్టైల్‌ కూడా చాలా భిన్నంగా ఉంటుందట. మరి ఏప్రిల్‌ 8న ఫస్ట్‌లుక్‌ విడుదల చేస్తారా? లేదా టైటిల్‌ మాత్రమే చెబుతారా? ఏకంగా చిన్న టీజర్‌ వదులుతారో తెలియాలంటే ఒక్క రోజు వేచి చూడాల్సిందే. అయితే, ఇటీవల విడుదల చేసిన ఫ్యాన్‌మేడ్‌ పోస్టర్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘శేషాచలం’ అనే పేరు పరిశీలనలో ఉంది. అయితే, రెండు అక్షరాలతో టైటిల్‌ పెడితే ఎలా ఉంటుందన్న దానిపైనా చిత్ర బృందం ఆలోచిస్తోందట. మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని