యూవీ ట్వీట్‌.. నిరాశకు గురైన ప్రభాస్‌ ఫ్యాన్స్‌!
close
Published : 07/04/2020 22:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యూవీ ట్వీట్‌.. నిరాశకు గురైన ప్రభాస్‌ ఫ్యాన్స్‌!

హైదరాబాద్‌: కథానాయకుడు ప్రభాస్‌ తదుపరి సినిమా అప్‌డేట్‌ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను త్వరలోనే విడుదల చేయబోతున్నామని ఇటీవల దర్శకుడు రాధాకృష్ణ ప్రకటించారు. అయితే ప్రస్తుతానికి సినిమా పనుల్ని పక్కనపెడుతున్నట్లు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ మంగళవారం ట్వీట్‌ చేసింది. ‘ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా మంది ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మా సినిమా పనుల్ని వాయిదా వేస్తున్నాం. కరోనా వైరస్‌ నుంచి పూర్తిగా విముక్తి పొందిన తర్వాత మరిన్ని అప్‌డేట్స్‌తో మీ ముందుకు వస్తామని ప్రమాణం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండాలని, సురక్షితంగా ఉండాలని కోరుతున్నాం’ అని పోస్ట్‌ చేసింది. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ నిరాశ చెందారు. రకరకాల మీమ్స్‌ కామెంట్లుగా పోస్ట్‌ చేశారు.

‘సాహో’ తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న 20వ సినిమా ఇది. పూజాహెగ్డే కథానాయిక. ఇటీవల ఈ సినిమా జార్జియా షూటింగ్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. కరోనా నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన తర్వాత ప్రభాస్‌, పూజా హెగ్డే స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని