అల్లు అర్జున్‌ బర్త్‌డే గిఫ్ట్‌ వచ్చేసింది!
close
Updated : 10/04/2020 17:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అల్లు అర్జున్‌ బర్త్‌డే గిఫ్ట్‌ వచ్చేసింది!

హైదరాబాద్‌: ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న అల్లు అర్జున్‌ అభిమానులకు ఆయన పుట్టిన రోజు గిఫ్ట్‌ అందింది. బన్ని కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం మైత్రీ మూవీ మేకర్స్‌ అభిమానులతో పంచుకుంది. 

ఈ చిత్రానికి ‘పుష్ప’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. గుబురు గడ్డం, ఒత్తు జుట్టుతో తీక్షణంగా చూస్తున్న బన్ని లుక్‌ మాస్‌ను ఆకట్టుకునేలా ఉంది. ‘ఇది నా తర్వాత చిత్రం ఫస్ట్‌లుక్‌. టైటిల్‌ ‘పుష్ప’. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. దీని గురించి చాలా ఉత్సుకతతో ఉన్నా. ఇది మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా’ అని అల్లు అర్జున్‌ ట్వీట్‌ చేశారు.

చిత్తూరు ప్రాంతంలో సాగే ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారని సమాచారం. బన్ని ఇందులో రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నారని ఇటీవలే వార్తలొచ్చాయి. అందుకు తగినట్లుగానే తాజాగా విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌, స్టైల్‌ కూడా చాలా భిన్నంగా ఉన్నాయి. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. రెండు అక్షరాలతో పేరు పెడతారని గత కొంతకాలంగా టాక్‌ వినిపిస్తోంది. అందుకు తగినట్లుగానే ‘పుష్ప’ అనే టైటిల్‌ను ఖరారు చేయడం విశేషం. 
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని