బన్నీ లుక్‌.. సెలబ్రిటీలు ఏమన్నారంటే?
close
Published : 08/04/2020 14:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బన్నీ లుక్‌.. సెలబ్రిటీలు ఏమన్నారంటే?

వావ్.. అదిరిపోయింది..!

హైదరాబాద్‌: స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కొత్త చిత్రం ‘పుష్ప’ ఫస్ట్‌లుక్‌కు విశేషమైన స్పందన లభిస్తోంది. ఈ చిత్రానికి సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక కథానాయికగా నటిస్తున్నారు. బుధవారం బన్నీ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమా టైటిల్‌, ప్రచార చిత్రాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. బన్నీ మాస్‌ లుక్‌లో విభిన్నంగా దర్శనమిచ్చారు. ఈ నేపథ్యంలో ఫస్ట్‌లుక్‌ సూపర్‌గా ఉందని ప్రముఖులు ట్వీట్లు చేశారు.

* వి.వి. వినాయక్‌: ఎంతో శ్రమించే స్టైలిష్‌ స్టార్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ‘పుష్ప’ చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు.

* రత్నవేలు: పుట్టినరోజు శుభాకాంక్షలు అల్లు అర్జున్‌. మీకు ఈ ఏడాది గొప్పగా ఉండాలని కోరుకుంటున్నా. ఆల్‌ ది బెస్ట్‌.

* దేవిశ్రీ ప్రసాద్‌: ప్రియమైన ‘పుష్ప’కు పుట్టినరోజు శుభాకాంక్షలు. నా తరఫున, ట్విటర్‌లో చురుకుగా ఉండని మన సుకుమార్‌ తరఫున విష్‌ చేస్తున్నా. కీప్‌ రాకింగ్‌, డ్యాన్సింగ్‌, ఎంటర్‌టైనింగ్‌ బన్నీ బాయ్‌. ‘పుష్ప’ లుక్‌ అమేజింగ్‌గా ఉంది.

* శ్రీరామ్‌ ఆదిత్య: లుక్‌ కిక్కాస్‌గా ఉంది. పుట్టినరోజు శుభాకాంక్షలు బన్నీ.

* వెంకీ కుడుముల: హ్యాపీ బర్త్‌డే అల్లు అర్జున్‌ సర్‌. ఈ అద్భుతమైన లుక్‌ కోసం చాలా మారారు. సుకుమార్‌ విజన్‌ను ప్రశంసించాలి. మొత్తం చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు.

* బాబీ: ‘పుష్ప’ లుక్‌ అద్భుతంగా ఉంది. శ్రమించే తత్వం ఉన్న స్టైలిష్‌ స్టార్‌కు హ్యాపీ బర్త్‌డే.

* మారుతి: జన్మదిన శుభాకాంక్షలు బన్నీ బాబు. నువ్వు ఎంత ఎత్తు ఎదిగినప్పటికీ మన స్నేహంలో ఎలాంటి మార్పు లేదు. నీకు మరిన్ని హిట్లు లభించాలని కోరుకుంటున్నా. మంచి స్నేహితుడు ఉంటే ఏదైనా సాధించవచ్చనే నమ్మకాన్ని నాకు ఇచ్చిన మా స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కి థాంక్స్‌.

* రకుల్‌ప్రీత్‌ సింగ్‌: నాకిష్టమైన వ్యక్తి అల్లు అర్జున్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ప్రతి విషయంలోనూ నీకు ది బెస్ట్ లభించాలి. ‘పుష్ప’ ఫస్ట్‌లుక్‌ అద్భుతంగా ఉంది. ఈ ఏడాది నీకు బ్లాక్‌బస్టర్‌ రావాలని, నీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నా.

* సురేందర్‌ రెడ్డి: పుట్టినరోజు శుభాకాంక్షలు అల్లు అర్జున్‌. ఈ ఏడాది నీకు అద్భుతంగా ఉండాలి. ‘పుష్ప’ చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్‌.

* మంచు లక్ష్మి: బన్నీ.. నేను కలిసిన వారిలో నువ్వు ఓ అద్భుతమైన వ్యక్తివి. జన్మదిన శుభాకాంక్షలు. ‘పుష్ప’ ఫస్ట్‌లుక్‌ అదిరిపోయింది.

* తమన్‌: హ్యాట్రిక్‌ బ్లాక్‌బస్టర్‌ కొట్టాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్‌డే బ్రదర్‌. నువ్వు ప్రతి సినిమా కోసం కష్టపడుతూ వెళ్తున్న తీరుకు సాటిలేదు. సెట్‌లో నిన్ను ప్రతి క్షణం గమనించా. నీకు మరిన్ని విజయాలు చేకూరాలని కోరుకుంటున్నా.

* నిఖిల్‌: వావ్‌.. బన్నీ భాయ్‌ ఎప్పుడూ ది బెస్ట్‌తో మన ముందుకు వస్తారు. ఇంకో బ్లాక్‌బస్టర్‌ రాసిపెట్టుకోండమ్మా. పుట్టినరోజు శుభాకాంక్షలు అల్లు అర్జున్‌. శ్రమించే విషయంలో నువ్వు మా అందరికీ స్ఫూర్తి.

* రష్మిక: పుట్టినరోజు శుభాకాంక్షలు అల్లు అర్జున్‌ సర్‌. ‘పుష్ప’ లుక్‌ ప్రేక్షకులకు నచ్చిందని ఆశిస్తున్నా.

* హన్సిక: అద్భుతమైన వ్యక్తి అల్లు అర్జున్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ‘పుష్ప’ ఫస్ట్‌లుక్‌ సూపర్‌గా ఉంది, ఆల్‌ ది బెస్ట్‌.

* అల్లు శిరీష్‌: హ్యాపీ హ్యాపీ బర్త్‌డే బన్నీ. చిన్నతనం నుంచి నువ్వు ప్రతి విషయంలోనూ నాకు స్ఫూర్తిగా నిలుస్తూ వచ్చావు. ఈ ఏడాది నీకు గొప్పగా ఉండాలని కోరుకుంటున్నా.

* సాయిధరమ్‌ తేజ్‌: దక్షిణాది స్టైలిష్‌ స్టార్‌ మా బన్నీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ‘పుష్ప’ లుక్‌ చాలా నచ్చింది.

* గుణశేఖర్‌: ఒకప్పుడు గోనగన్నారెడ్డి.. ఆపై ‘అల వైకుంఠపురములో..’లో బంటు.. ఇప్పుడు ‘పుష్ప’. విభిన్నమైన పాత్రలతో అల్లు అర్జున్‌ తనను తాను కొత్తగా ఆవిష్కరిస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలు బన్నీ.
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని