శ్రుతిహాసన్‌ మాటతో ఫ్యాన్స్‌ నిరాశ 
close
Published : 11/04/2020 16:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శ్రుతిహాసన్‌ మాటతో ఫ్యాన్స్‌ నిరాశ 

‘వకీల్‌ సాబ్‌’ గురించి నటి ఏం చెప్పారంటే..!

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ కీలకపాత్రలో నటిస్తున్న ‘వకీల్‌ సాబ్‌’ చిత్రం గురించి నటి శ్రుతిహాసన్‌ చెప్పిన మాటతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘పింక్‌’ చిత్రానికి రీమేక్‌గా తెలుగులో ‘వకీల్‌ సాబ్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్‌కల్యాణ్‌ సతీమణిగా శ్రుతిహాసన్‌ కనిపించనున్నారంటూ గత కొన్నిరోజులగా వార్తలు వచ్చాయి. దీంతో అభిమానులు ‘గబ్బర్‌సింగ్‌’ జంటను మరోసారి వెండితెరపై చూడనున్నామంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఓ ఆంగ్ల పత్రికవారు శ్రుతిహాసన్‌ను సంప్రదించగా.. తాను ‘వకీల్‌ సాబ్‌’ చిత్రంలో నటించడం లేదని స్పష్టం చేశారు. ‘అది ఒక అవాస్తవమైన వార్త. ఆ వార్తలు నిజమని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. అవన్నీ రూమర్స్‌ మాత్రమే కాబట్టి నేను దాని గురించి మాట్లాడాలనుకోవడం లేదు.’ అని శ్రుతిహాసన్‌ స్పష్టత ఇచ్చారు. దీంతో అభిమానులు కొంతవరకూ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

దాదాపు మూడేళ్ల తర్వాత శ్రుతిహాసన్‌ తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘క్రాక్‌’. రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహస్తున్నారు. మరోవైపు ‘వకీల్‌ సాబ్‌’ చిత్రాన్ని వేసవి కానుకగా మే నెలలో విడుదల చేయాలని చిత్రబృందం భావించింది.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని