బాలయ్య సినిమా పొలిటికల్‌ డ్రామా కాదు
close
Published : 22/04/2020 21:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాలయ్య సినిమా పొలిటికల్‌ డ్రామా కాదు

ఆ హీరోయిన్స్‌ ఎవరంటే: బోయపాటి శ్రీను

హైదరాబాద్‌: ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాల తర్వాత నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో హ్యాట్రిక్‌ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ 106వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ఇటీవల ప్రారంభమైనప్పటికీ ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు బోయపాటి శ్రీనును ఓ మీడియా ఛానెల్‌ వారు ప్రత్యేకంగా ఫోన్‌లో సంప్రదించగా.. ఆయన బాలకృష్ణ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 

ఇప్పటికే ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తయ్యిందని, ఫస్ట్‌ షెడ్యూల్‌లో భాగంగా ఓ ఎమోషనల్‌ బ్లాక్‌ను బాలయ్యపై చిత్రీకరించామని బోయపాటి తెలిపారు. అనంతరం ఆయన ఆ సినిమా గురించి వస్తున్న పలు రూమర్స్‌పై స్పందించారు. బాలయ్యతో తాను తెరకెక్కిస్తున్న చిత్రం పొలిటికల్‌ డ్రామా కాదని, ఓ మంచి సోషల్‌ మెసేజ్‌తో కూడిన కుటుంబకథా చిత్రమని పేర్కొన్నారు. ఈ సినిమాలో బాలయ్య కొత్త క్యారెక్టరైజేషన్‌లో మెప్పించనున్నారని.. వారణాసి బ్యాక్‌గ్రౌండ్‌ గురించి అందరూ చెప్పుకోడానికి కారణమదేనని తెలిపారు. ప్రస్తుతానికి హీరోయిన్స్‌ను ఫిక్స్‌ చేయలేదని.. కథకు తగ్గట్టుగా ఇద్దరు హీరోయిన్స్‌ అనుకున్నామని, కాకపోతే వాళ్లు ఇక్కడ చేసేవాళ్లు కాదని ఆయన వివరించారు. లాక్‌డౌన్‌ పూర్తయ్యిన వెంటనే ఆ హీరోయిన్స్‌ సంప్రదించి.. చర్చించిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తానని వెల్లడించారు. మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని