సీక్వెల్‌కి స్క్రిప్ట్‌ రాస్తున్న హీరో
close
Published : 23/04/2020 20:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సీక్వెల్‌కి స్క్రిప్ట్‌ రాస్తున్న హీరో

‘మేజర్‌’ పార్ట్‌ షూట్‌ అయ్యింది: శేష్‌

హైదరాబాద్‌: యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కి బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబట్టడంతోపాటు ప్రముఖులు ప్రశంసలు అందుకున్న చిత్రం ‘గూఢచారి’. శశి కిరణ్‌ తిక్కా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అడివి శేష్‌ కథానాయకుడిగా నటించారు. అంతేకాకుండా ఆయన ఈ సినిమా స్ర్కీన్‌ప్లేలో కూడా భాగమయ్యారు. ప్రస్తుతం అడివి శేష్‌ ‘మేజర్‌’ సినిమాలో చిత్రంలో నటిస్తున్నారు. మేజర్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రం తెరకెక్కుతుంది. లాక్‌డౌన్‌ కారణంగా ఆ సినిమా షూటింగ్‌ నిలిచిపోవడంతో ప్రస్తుతం ఆయన తన తదుపరి సినిమా ‘గూఢచారి 2’ పనుల్లో బిజీగా ఉన్నారు. ‘గూఢచారి’ చిత్రానికి సీక్వెల్‌గా రానున్న సినిమాకు సంబంధించిన స్ర్కిప్ట్‌ వర్క్‌లో ఆయన ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన ఓ ఆంగ్ల పత్రికతో పంచుకున్నారు.

‘లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన నేను ప్రస్తుతం ‘గూఢచారి 2’ స్ర్కిప్ట్‌ రాస్తున్నాను. అలాగే ‘మేజర్‌’ సినిమా ఎడిటింగ్‌ పనులు కూడా చూస్తున్నాను. లాక్‌డౌన్‌కు కొన్నిరోజుల ముందు ‘మేజర్‌’ సినిమాలోని అతి ముఖ్యమైన సన్నివేశాలను బోర్డర్‌లో చిత్రీకరించాం. ఇప్పటివరకూ నా సినీ కెరీర్‌లో ఇదే చాలా క్లిష్టమైన షూట్‌‌. ఇప్పటికే గుర్తుండిపోయే ఓ గొప్ప అనుభవం’ అని శేష్‌ పేర్కొన్నారు.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని