ఆసక్తికరంగా ‘క్రాక్‌’లో సముద్రఖని లుక్‌!
close
Published : 28/04/2020 05:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆసక్తికరంగా ‘క్రాక్‌’లో సముద్రఖని లుక్‌!

హైదరాబాద్‌: మాస్‌ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘క్రాక్‌’. ఈ సినిమాలో ప్రముఖ తమిళ నటుడు సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆదివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ చిత్ర బృందం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. చిత్రంలో సముద్రఖని ‘కటారీ’ అనే పాత్రను పోషిస్తున్నట్లు తెలిపారు. ఆయన మాస్‌ లుక్‌లో.. చేతిలో కత్తిపట్టుకుని ఆసక్తికరంగా కనిపించారు. సముద్రఖని ఇటీవల వచ్చిన ‘అల వైకుంఠపురములో..’ ప్రతినాయకుడిగా కనిపించి మెప్పించారు. ఆయన నటనకు ప్రశంసలు దక్కాయి.

క్రాక్‌’కు గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. సరస్వతి ఫిల్మ్స్‌ డివిజన్‌ సంస్థ నిర్మిస్తోంది. తమన్‌ బాణీలు అందిస్తున్నారు. శ్రుతిహాసన్‌ కథానాయిక. ఆమె, రవితేజ ఇప్పటికే ‘బలుపు’ సినిమా కోసం పనిచేసిన సంగతి తెలిసిందే. మే నెలలో ‘క్రాక్‌’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేసింది. కానీ లాక్‌డౌన్‌ నేపథ్యంలో షూటింగ్‌తోపాటు విడుదల కూడా వాయిదా పడింది.



మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని