మహేశ్‌ నెక్ట్స్‌ పరశురామ్‌తో ఫిక్స్‌!
close
Updated : 01/05/2020 10:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహేశ్‌ నెక్ట్స్‌ పరశురామ్‌తో ఫిక్స్‌!

హైదరాబాద్‌: ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం తర్వాత సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ఏ దర్శకుడితో పనిచేయనున్నారనే విషయంలో సినీ ప్రియుల్లో ఎప్పటినుంచే ఆసక్తి నెలకొని ఉంది. SSMB28 చిత్రానికి సంబంధించి ఎందరో దర్శకుల పేర్లు కూడా వినపడ్డాయి. ఈ నేపథ్యంలో మహేశ్‌బాబు తన తదుపరి చిత్రాన్ని ‘గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్‌తో చేయనున్నారు.

ఈ విషయంపై దర్శకుడు పరశురామ్‌ మాట్లాడుతూ.. ‘మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన ‘ఒక్కడు’ సినిమా నేను తెలుగు సినీ పరిశ్రమవైపు అడుగులు వేసేలా చేసింది. మహేశ్‌బాబు సర్‌తో ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచే అనుకుంటున్నాను. ఇప్పటికీ నా కల నేరవేరుతోంది. ఓ అద్భుతమైన కథతో మేము మీ ముందుకు రానున్నాం. ఈ సినిమా తప్పకుండా ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రమవుతుంది. ఎలివేషన్‌ సీన్స్‌ను రాయలేకకాదు.. అవసరం రాలేదు. కానీ ఇప్పుడు నాలోని ఆ యాంగిల్‌ను కూడా చూస్తారు’ అని తెలియజేశారు.

నిఖిల్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ‘యువత’ సినిమాతో వెండితెరకు దర్శకుడిగా పరిచయమైన పరశురామ్ ఆ తర్వాత ‘సోలో’ సినిమాతో ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. 2018లో విడుదలైన ‘గీతగోవిందం’ సినిమా పరశురామ్‌ కెరీర్‌కు ఓ మంచి విజయాన్ని అందించింది.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని