అజిత్‌ పుట్టిన రోజు.. నో సర్‌ప్రైజ్‌!
close
Published : 01/05/2020 07:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అజిత్‌ పుట్టిన రోజు.. నో సర్‌ప్రైజ్‌!

చెన్నై: ప్రస్తుతం కరోనా సమస్యతో ప్రజలంతా ఇబ్బంది పడుతుండటంతో తన నిర్మాణంలోని సినిమాకు సంబంధించిన ఎలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించేది లేదని నిర్మాత బోనీ కపూర్‌ పేర్కొన్నారు. అజిత్‌ కథానాయకుడిగా ఆయన నిర్మిస్తున్న చిత్రం ‘వలిమై’. హెచ్‌.వినోత్‌ దర్శకుడు. దీపావళి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే, కరోనా కారణంగా ప్రస్తుతం చిత్రీకరణ ఆగిపోయింది. 

మే 1వ తేదీన అజిత్‌ పుట్టినరోజు కావడంతో ‘వలిమై’ నుంచి టీజర్‌, ఫస్ట్‌లుక్‌ వచ్చేఅవకాశం ఉందని అభిమానులు ఆశగా ఎదురు చూశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు చేపట్టడం లేదని చిత్ర వర్గాలు అధికారికంగా తెలిపాయి. మరోవైపు తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించరాదని నటుడు అజిత్‌ అభిమానులకు సూచించారు.
 


Advertisement


మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని