అవును నిజమే.. అఘోరాగా బాలయ్య..!
close
Published : 01/05/2020 10:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అవును నిజమే.. అఘోరాగా బాలయ్య..!

బోయపాటి శ్రీను

హైదరాబాద్‌: టాలీవుడ్‌ అగ్రకథానాయకుడు నందమూరి బాలకృష్ణ తన తదుపరి చిత్రంలో అఘోరా పాత్రలో కనిపించనున్నారని దర్శకుడు బోయపాటి శ్రీను అధికారికంగా వెల్లడించారు. ‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాలతో బాలకృష్ణను మాస్‌ అభిమానులకు బోయపాటి శ్రీను మరింత దగ్గర చేశారు. ప్రస్తుతం బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ప్రారంభమైన ఈసినిమా షూటింగ్‌ను కరోనా కారణంగా కొంతకాలం పాటు వాయిదా వేశారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో బాలకృష్ణ పాత్ర గురించి గత కొంత కాలం నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో బాలయ్య అఘోరాగా కనిపించనున్నారంటూ సినీ ప్రియులు అనుకుంటున్నారు.  

కాగా, తాజాగా బాలయ్య సినిమా గురించి బోయపాటి మీడియాతో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాల కంటే విభిన్నంగా ఓ మంచి సినిమాని ప్రేక్షకులను అందించనున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా ఈ సినిమాలో బాలయ్య అఘోరా గెటప్‌లో కనిపించనున్నారని వస్తున్న వార్తలు నిజమేనని వెల్లడించారు. అయితే తప్పకుండా ఓ మంచి సినిమాని ప్రేక్షకులకు అందిస్తానని ఆయన వెల్లడించారు.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని