అందమైన ప్రేమకథతో..
close
Published : 08/05/2020 08:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందమైన ప్రేమకథతో..

సందీప్‌.. సిక్స్‌ప్యాక్‌

సందీప్‌ కిషన్‌ కథానాయకుడిగా ఆనంది ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కనుంది. రామ్‌ అబ్బరాజు  దర్శకత్వం వహించనున్నారు. పి.కిరణ్‌ నిర్మాత. గురువారం సందీప్‌ జన్మదినం సందర్భంగా ఈ కొత్త చిత్రాన్ని ప్రకటించింది  చిత్ర బృందం. ‘‘అందమైన ప్రేమ కథతో కూడిన కుటుంబ చిత్రమిది. ప్రస్తుతం సందీప్‌ నటిస్తున్న సినిమా పూర్తికాగానే మా చిత్రాన్ని పట్టాలెక్కిస్తాం’’ అని చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది. కథ: భాను బోగవరపు.

సందీప్‌ కిషన్‌ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’. డెన్నిస్‌ జీవన్‌ కనుకొలను  దర్శకుడు. టీజీ విశ్వ ప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌, దయా పన్నెంలతో కలిసి సందీప్‌ నిర్మిస్తున్నారు. లావణ్య త్రిపాఠి నాయిక. సందీప్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన కొత్తలుక్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.    ‘‘హాకీ నేపథ్యంలో రూపొందుతోన్న తొలి తెలుగు చిత్రమిది. ఇందులోని పాత్ర కోసం తొలిసారి సిక్స్‌ప్యాక్‌తో కనిపించబోతున్నారు సందీప్‌’’ అని తెలిపాయి చిత్ర వర్గాలు.



మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని