‘గబ్బర్‌ సింగ్‌’ మేజిక్‌ రిపీట్‌!
close
Published : 12/05/2020 17:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘గబ్బర్‌ సింగ్‌’ మేజిక్‌ రిపీట్‌!

హైదరాబాద్‌: పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా హరీశ్‌ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘గబ్బర్‌సింగ్‌’. తమ అభిమాన కథానాయకుడిని అభిమానులు ఎలా చూడాలనుకున్నారో అంతకు మించి ఎక్కువే చూపించారు దర్శకుడు హరీశ్‌ శంకర్‌. ఈ ఒక్క సినిమాతో అటు పవన్‌కల్యాణ్‌కు, ఇటు ఆయన అభిమానులకు మర్చిపోలేని గిప్ట్ ఇచ్చారు. ఈ సినిమాలో కథ, కథనాలు, పవన్‌ యాక్షన్‌, శ్రుతి అందాలు ఒక ఎత్తయితే దేవీశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ మరో ఎత్తు. ‘గబ్బర్‌సింగ్‌’లోని పాటలన్నీ యువతను ఓ ఊపు ఊపేశాయి. మరోసారి ఈ మేజిక్‌ వెండితెరపై పునరావృతం అవుతోంది. పవన్‌కల్యాణ్‌ హీరోగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో రానున్న #PSPK28కు కూడా దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనున్నారు. ట్విటర్‌ వేదికగా హరీశ్‌ శంకర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.

‘‘ఇదొక అద్భుతమైన రోజు. ఆ ఎనర్జీ విడుదలై 8 సంవత్సరాలు గడిచాయి. ఆ మ్యూజికల్‌ ఎనర్జీని రీక్రియేట్‌ చేస్తున్నట్లు చెప్పడానికి ఇంతకన్నా మంచి రోజు ఉండదేమో. పవన్‌కల్యాణ్‌ 28వ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. మళ్లీ మేము మీ ముందుకు రాబోతున్నాం. ఇప్పుడే మొదలైంది....’’ -ట్విటర్‌లో దర్శకుడు హరీశ్‌ శంకర్‌

పవన్‌-హరీశ్‌ శంకర్‌ కాంబోలో వచ్చిన ‘గబ్బర్‌సింగ్‌’ విడుదలైన మే 11వ తేదీకీ 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కాగా, ప్రస్తుతం పవన్‌ ‘వకీల్‌సాబ్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత క్రిష్‌ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రంపై పూర్తి దృష్టి పెడతారు. ఈ రెండు అయిపోగానే హరీశ్‌ శంకర్‌ సినిమా పట్టాలెక్కనుంది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా విరామం దొరకడంతో కథ, కథనాలు, నటీనటుల ఎంపికపై హరీశ్‌ శంకర్‌ కసరత్తులు చేస్తున్నారు.

 

 
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని