యూట్యూబ్‌లో దూసుకెళ్తోన్న అన్నదమ్ములు..!
close
Updated : 13/05/2020 11:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యూట్యూబ్‌లో దూసుకెళ్తోన్న అన్నదమ్ములు..!

ఒకరు వీడియోతో.. మరొకరు ఆడియోతో..

హైదరాబాద్‌: అగ్రకథానాయకుడు అల్లు అర్జున్‌, ఆయనకు సోదరుడి వరసయ్యే వైష్ణవ్‌ తేజ్‌ యూట్యూబ్‌లో దూసుకెళ్తోన్నారు. ఒకరు వీడియో సాంగ్‌తో ప్రేక్షకులను మెప్పిస్తుంటే మరొకరు ఆడియో సాంగ్‌తో అలరిస్తున్నారు. బన్నీ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌ వర్షం కురిపించి బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని నమోదు చేసుకుంది. తమన్‌ స్వరాలు అందించిన ఈ చిత్రంలోని పాటలు సినిమా విడుదల కంటే ముందే రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ‘అల....’ చిత్రంలోని ‘రాములో రాములా’ వీడియో సాంగ్‌ 100 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుని యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. కాసర్ల శ్యామ్‌ రచించిన ఆ పాటను అనురాగ్‌ కులకర్ణి, మంగ్లీ అలపించారు.

మరోవైపు సాయిధరమ్‌ తేజ్‌ సోదరుడిగా వైష్ణవ్‌ తేజ్‌ వెండితెరకు పరిచయం కానున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఉప్పెన’ చిత్రంతో వైష్ణవ్‌ కథానాయకుడిగా అలరించేందుకు సిద్ధమయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ స్వరాలు అందిస్తున్నారు. కృతీశెట్టి కథానాయిక. ఇటీవల విడుదలైన ఈ సినిమాలోని ‘నీ కన్ను నీలి సముద్రం’ అనే ఆడియో సాంగ్‌ ఇప్పటివరకూ 50 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుని యూట్యూబ్‌లో ప్రేక్షకులను అలరిస్తుంది. విజయ్‌ సేతుపతి ఈ చిత్రంలో కీలకపాత్రలో కనిపించనున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్‌ 2న ‘ఉప్పెన’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించినప్పటికీ లాక్‌డౌన్‌ వల్ల కొంతకాలం పాటు వాయిదా వేశారు.

 
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని