‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదల.. నిర్మాత క్లారిటీ..!
close
Published : 15/05/2020 20:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదల.. నిర్మాత క్లారిటీ..!

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా సినిమా విడుదల షెడ్యూల్స్‌లో మార్పులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కోవలోనే ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమా విడుదల కూడా వాయిదా పడబోతోందని నిర్మాత దానయ్య తెలిపారు. 2021 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని యూనిట్‌ భావించింది. కానీ, అందులో మార్పులు జరగబోతున్నాయి. ‘సినిమాకు సంబంధించి 70 శాతం షూటింగ్‌ పూర్తయింది. మిగిలిన 30 శాతం షూట్‌ను రెండు-మూడు నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది. కానీ లాక్‌డౌన్‌ వల్ల అది వాయిదాపడింది. దీని ప్రభావం వీఎఫ్‌ఎక్స్‌ పనులపై పడే అవకాశం ఉంది. అలా కాకుండా ఉండాలంటే విడుదలలో మార్పులు జరగాల్సిందే. ప్రభుత్వం మాకు అనుమతులు ఇస్తే.. పరిమిత బృందంతో సెట్‌లో షూట్‌ జరుపుతాం’ అని ఆయన ఓ ఆంగ్లపత్రికతో అన్నారు.

ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రమిది. అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమరం భీమ్‌గా ఎన్టీఆర్‌ కనిపించబోతున్నారు. చెర్రీకి జంటగా ఆలియా భట్‌, తారక్‌కు జంటగా ఒలీవియా మోరీస్‌ సందడి చేయనున్నారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. దాదాపు రూ.400 కోట్ల  బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ‘బాహుబలి’ తర్వాత జక్కన్న తీస్తున్న సినిమా ఇది కావడం.. ఇందులో తారక్‌-చెర్రీ  నటిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.




మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని