నిర్మాత ట్వీట్‌.. ‘నిశ్శబ్దం’ రూమర్స్‌కు చెక్‌..!
close
Updated : 18/05/2020 12:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిర్మాత ట్వీట్‌.. ‘నిశ్శబ్దం’ రూమర్స్‌కు చెక్‌..!

ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఇక్కడికి వచ్చాం..

హైదరాబాద్‌: అగ్రకథానాయిక అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి హేమంత్‌ మధూకర్‌ దర్శకత్వం వహించారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోనా ఫిల్మ్‌ కార్పొరేషన్‌ బ్యానర్లపై కోన వెంకట్‌, టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. అనుష్కతోపాటు మాధవన్‌, అంజలి, షాలినీ పాండే.. ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ నెలలో విడుదల చేయాలని భావించినప్పటికీ లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. థియేటర్లు మూతపడటంతో ‘నిశ్శబ్దం’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయనున్నారంటూ గత కొన్నిరోజులుగా రూమర్లు‌ వినిపిస్తున్నాయి.

కాగా, తాజాగా చిత్రనిర్మాత కోన వెంకట్‌ పెట్టిన ట్వీట్‌తో ఈ సినిమా రిలీజ్‌పై వస్తోన్న రూమర్లకు చెక్‌ పడినట్లయ్యింది.‘సినిమా పట్ల మాకున్న అమితమైన ఆసక్తి, ప్రేమతోనే పరిశ్రమలోకి అడుగుపెట్టాం. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నాం. మేము తీసిన సినిమా చూసి థియేటర్‌లో ప్రేక్షకులు ఇచ్చే రియాక్షనే మాకు ప్రేరణ, ఆక్సిజన్‌. ఆ ఫీలింగ్‌ను ఏదీ మ్యాచ్‌ చేయలేదు. సినిమా ఉన్నది సినిమా హాళ్ల కోసమే. అదే మా ప్రాధాన్యం కూడా....!!’ అని కోన వెంకట్‌ ట్వీట్‌ చేశారు.

 
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని