close
Published : 18/05/2020 13:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎన్టీఆర్‌ అభిమానులకు నిరాశ..!

బర్త్‌డే సర్‌ప్రైజ్‌ లేదు: ఆర్‌ఆర్‌ఆర్‌

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ‘ఆర్‌ఆర్‌ఆర్’ నుంచి ఫస్ట్‌లుక్‌ కానీ స్పెషల్‌ టీజర్‌ కానీ ఉంటుందని అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. అయితే ఎన్టీఆర్‌ బర్త్‌డేకి ఎలాంటి సర్‌ప్రైజ్‌ ఇవ్వడం లేదని తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ వెల్లడించింది. లాక్‌డౌన్‌ పొడిగింపు నేపథ్యంలో పనులన్నీ నిలిచిపోయాయని అందువల్ల వీడియోని కానీ ఫస్ట్‌లుక్‌ని కానీ విడుదల చేయలేకపోతున్నామని పేర్కొంది. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా ఓ ట్వీట్‌ పెట్టింది.‌

‘లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించిన నేపథ్యంలో పనులన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. తారక్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ఏదైనా స్పెషల్‌ వీడియోను విడుదల చేయాలని భావించాం. అందుకు మేము ఎంతగానో కష్టపడ్డాం. కాకపోతే వీడియో గ్లిమ్స్‌ పూర్తి కాలేదు. అందువల్ల మేము ఆయన పుట్టినరోజు నాడు ఫస్ట్‌లుక్ కానీ‌, వీడియో సర్‌ప్రైజ్‌ కానీ ఇవ్వడం లేదు. మీ ఎదురుచూపులకు తగ్గట్టుగానే అద్భుతమైన వర్క్‌ను మీకు అందిస్తాం. ఒక్కసారి అది విడుదలైన రోజు మనందరికీ పండగ అవుతుంది’ అని ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ పేర్కొంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పెట్టిన ట్వీట్‌తో తారక్‌ అభిమానులు నిరాశకు గురయ్యారు.

రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా చెర్రీ, కొమరం భీమ్‌గా తారక్‌ కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌, హాలీవుడ్‌ తారలు సందడి చేయనున్నారు.



Tags :

మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని