ఆలస్యమైనా పెళ్లి పక్కా జరుగుతుంది: నితిన్‌
close
Published : 25/05/2020 12:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆలస్యమైనా పెళ్లి పక్కా జరుగుతుంది: నితిన్‌

వీడియో రిలీజ్‌ చేసిన హీరో..!

హైదరాబాద్‌: ‘సాయిధరమ్‌ తేజ్‌.. ఇంకా ఎన్నిరోజులు ఇలాగే సింగిల్‌గా ఉంటావో నేను చూస్తా. కొన్నిసార్లు పెళ్లి చేసుకోవడంలో టైమ్‌ గ్యాప్‌ ఉండొచ్చు. కానీ పెళ్లి చేసుకోవడం మాత్రం పక్కా’ అని చెబుతున్నారు యువ హీరో నితిన్‌. సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సోలోబ్రతుకే సోబెటర్‌’. సుబ్బు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి ‘నో పెళ్లి’ సాంగ్‌ను సోమవారం నితిన్‌ సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు. అర్మాన్‌మాలిక్‌ అలపించిన ఈ పాటలో వరుణ్‌ తేజ్‌, రానా అతిథి పాత్రల్లో మెప్పించారు. దీనికి సంబంధించిన వీడియోను నితిన్‌తోపాటు సాయిధరమ్‌ తేజ్‌ సైతం ట్విటర్‌ వేదికగా నెటిజన్లతో షేర్‌ చేసుకున్నారు. 

‘‘సోలో బ్రతుకే సో బెటర్‌’ చిత్రం నుంచి మొదటిపాట ‘నో పెళ్లి’ని ఎంజాయ్‌ చేయండి. ప్రతి ఒక్క సింగిల్‌కి ఈ పాట అంకితం. నన్ను ఎంతగానో సపోర్ట్‌ చేసిన రానా దగ్గుబాటి, వరుణ్‌ తేజ్‌కు ధన్యవాదాలు. మంచి సాంగ్‌ను నాకు అందించిన తమన్‌, హీరోయిన్‌ నభానటేశ్‌కు థ్యాంక్యూ’ అని సాయిధరమ్‌ తేజ్‌ పేర్కొన్నారు. ఈ సినిమాలో సాయిధరమ్‌ సరసన నభానటేశ్‌ సందడి చేయనున్నారు.
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని