‘అందుకే వకీల్‌సాబ్ సూపర్‌ టైటిల్‌’
close
Updated : 27/05/2020 07:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘అందుకే వకీల్‌సాబ్ సూపర్‌ టైటిల్‌’

హైదరాబాద్‌: పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్‌సాబ్‌’. హిందీలో ఘన విజయం సాధించిన ‘పింక్‌’ రీమేక్‌గా ఈ సినిమా రాబోతోంది. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘వకీల్‌సాబ్‌’ మే నెలలో విడుదల కావాల్సి ఉంది. కరోనా కారణంగా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులకు ఆటంకం ఏర్పడి విడుదల వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టైటిల్‌పై ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. 

‘‘హిందీలో అమితాబ్‌బచ్చన్‌ నటించిన చిత్రానికి ‘పింక్‌’ అని పెట్టారు. తమిళంలో అజిత్‌ నటిస్తే ‘నేర్కొండ పార్వాయ్‌’ అని టైటిల్ పెట్టారు. తెలుగులో ఏం టైటిల్‌ పెడతారా? అని ఎదురు చూశా.  పవన్‌కల్యాణ్‌ దగ్గర ఒక అందం ఉంది. ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’, ఇలాంటి టైటిల్స్‌ ఏవీ తన మీద రాలేదు. ఆయన కూడా కోరుకోరు. మరి ఈ సినిమాకు ఎలాంటి టైటిల్‌ పెడతారా? అని ఆసక్తిగా ఎదురు చూశా. ‘వకీల్‌సాబ్‌’ సూపర్‌ టైటిల్‌. దీనికి ఈ టైటిల్‌ పెట్టకుండా, పాత రోజుల్లో సినిమాలకు పెట్టినట్లు పవన్‌ పేరు కలిసేలా ‘లాయర్‌ విశ్వనాథ్’, ‘లాయర్‌ భారతీదేవి’  ఇలా ఏదో పెడతారని అనుకున్నా. కానీ, అలా పెట్టలేదు. ఈ టైటిల్‌ ఆలోచన వచ్చిన వాళ్లకు హ్యాట్సాఫ్‌’’

‘‘ఈ దేశంలో ధర్మాన్ని, న్యాయాన్ని, చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత ముగ్గురిపై ఉంది. వాళ్లే పోలీస్‌, రాజకీయ నాయకులు, లాయర్లు. సాబ్‌ అంటే ఒక వ్యక్తిని అమితంగా గౌరవిస్తూ అతని పేరు వెనుక దీన్ని వాడతారు. ముస్లిం సోదరులను ఆకట్టుకునేలా కూడా ఈ టైటిల్‌ ఉంది. మంచి కథను, మంచి కథనంతో నడిపితే ఏ సినిమా అయినా భారీ విజయాన్ని అందుకుంటుంది. అందుకు అన్ని కలిసి రావాలి. ఇందులో కూడా అద్భుతమైన సంభాషణలు ఉంటాయని అనుకుంటున్నా. అవి కోట్లమందిపై ప్రభావం చూపి, సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. 
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని