‘వ్యాక్సిన్‌ వస్తుంది’
close
Published : 29/05/2020 11:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘వ్యాక్సిన్‌ వస్తుంది’

కరోనా కేవలం ప్రారంభం మాత్రమే.. : ప్రశాంత్‌ వర్మ

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ కేవలం ప్రారంభం మాత్రమేనని అంటున్నారు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. ‘అ!’, ‘కల్కి’ లాంటి రెండు విభిన్నకథా చిత్రాలతో మెప్పించిన ఆయన తాజాగా తన మూడో ప్రాజెక్ట్‌  ప్రకటించారు. ఈ సినిమాకి ‘వ్యాక్సిన్‌ వస్తుంది’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శుక్రవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘వ్యాక్సిన్‌ వస్తుంది’ ప్రీలుక్‌ను సోషల్‌మీడియా వేదికగా చిత్రబృందం నెటిజన్లతో పంచుకుంది. చారిత్రక కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్‌లో ఓ రక్కసి ప్రజలను హతమార్చినట్లు ఈ పోస్ట్‌ర్‌లో చూపించారు. నిజ జీవిత సంఘటనలను ఆధారంగా చేసుకుని తెలుగు సినీ తెరపై ఇప్పటివరకూ చూడని వినూత్నమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాలో నటించబోయే నటీనటుల గురించి తెలియాల్సి ఉంది.

‘అ!’, ‘కల్కి’ చిత్రాల తర్వాత ప్రశాంత్‌ వర్మ ‘అ2’ చిత్రాన్ని తెరకెక్కిస్తారని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ప్రశాంత్‌ వర్మ సైతం ‘అ2’ చిత్రాన్ని త్వరలోనే తెరకెక్కిస్తానని ఇటీవల ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఓ ట్వీట్ పెట్టారు. ప్రస్తుతం తాను వేరే కథలతో బిజీగా ఉన్నానని, అవి పూర్తైన తర్వాత ‘అ2’ చిత్రాన్ని రూపొందిస్తానని తెలిపారు. దీంతో ఇప్పుడు ఆయన తెరకెక్కించబోయే చిత్రం ‘అ!’ సినిమా సీక్వెల్‌ కాదని స్పష్టత వచ్చింది.
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని