కృష్ణ బర్త్‌డే.. మహేశ్‌ ఫ్యాన్స్‌కు శుభవార్త
close
Published : 30/05/2020 18:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కృష్ణ బర్త్‌డే.. మహేశ్‌ ఫ్యాన్స్‌కు శుభవార్త

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు తర్వాతి సినిమా ఖరారైంది. ఆయన 27వ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించబోతోంది. ‘గీత గోవిందం’ ఫేం పరశురాం ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. ఆదివారం మహేశ్‌ తండ్రి, సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు శుభవార్త చెప్పారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని మే 31న ఉదయం 9.09 గంటలకు సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నారు. ‘మహేశ్‌తో కలిసి మరో సినిమా కోసం పనిచేస్తున్నాం. మీరు ఈ చిత్రం గురించి ఎన్నో విన్నారు.. ఇప్పుడు అసలు నిజం తెలియడానికి సమయం దగ్గరపడింది’ అని మైత్రీ మూవీ మేకర్స్‌ ట్వీట్‌ చేసింది. జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14 రీల్స్‌ సంస్థలు కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తున్నాయి.

ఆదివారం ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ‘సర్కారి వారి పాట’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్‌ శైలి మాస్‌ అంశాలతో చిత్రం రూపొందుతోందట. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మహేశ్‌ నటిస్తున్న సినిమా ఇది. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన సినిమా హిట్‌ అందుకున్న సంగతి తెలిసిందే.


Advertisement


మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని