సర్కారు వారి పాట.. మహేశ్‌ లుక్‌ అదుర్స్‌
close
Updated : 31/05/2020 09:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సర్కారు వారి పాట.. మహేశ్‌ లుక్‌ అదుర్స్‌

కృష్ణ బర్త్‌డే.. సూపర్‌స్టార్‌ సర్‌ప్రైజ్‌

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన తనయుడు మహేశ్‌బాబు అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. తన తదుపరి సినిమా గురించి అధికారికంగా ప్రకటించారు. ‘గీత గోవిందం’ ఫేమ్‌ పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి  ‘సర్కారు వారి పాట’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. కృష్ట పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను మహేశ్‌ ఆదివారం ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు. ఇందులో మహేశ్‌ మాస్‌ లుక్‌లో ఆకట్టుకున్నారు. చెవి పోగుతో మెడపై రూపాయి టాటూతో సరికొత్తగా కనిపించారు. ‘హ్యాట్రిక్‌ కోసం బ్లాక్‌బస్టర్‌ ఆరంభం’ అని పేర్కొన్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.

‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో ఈ ఏడాది ఆరంభంలోనే మహేశ్‌ హిట్‌ అందుకున్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్రలో కనిపించారు. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మహేశ్‌ కుటుంబంతో కొంతకాలంపాటు విదేశాలకు వెళ్లి వచ్చారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమై తన చిన్నారులతో సరదాగా గడుపుతున్నారు. ఆయా ఫొటోలను సైతం నమ్రత ఇన్‌స్టా వేదికగా నెటిజన్లతో పంచుకుంటున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా తర్వాత రాజమౌళి-మహేశ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రానుంది.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని