కామ్రేడ్‌ భారతక్కను చూశారా..!
close
Updated : 04/06/2020 10:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కామ్రేడ్‌ భారతక్కను చూశారా..!

ట్వీట్‌ చేసిన రానా

హైదరాబాద్‌: ‘విరాటపర్వం’లో కామ్రేడ్‌ భారతక్క ఎంతో కీలకమని నటుడు రానా అన్నారు. రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘విరాటపర్వం’. వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నటి ప్రియమణి కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇందులో ఆమె కామ్రేడ్‌ భారతక్కగా కనిపించనున్నారు. గురువారం ఆమె పుట్టినరోజు సందర్భంగా ‘విరాటపర్వం’ చిత్రం నుంచి ప్రియమణి ఫస్ట్‌లుక్‌ను రానా ట్వీట్‌ చేశారు. ‘మహా సంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని ఆమె నమ్మింది. ఫ్రెంచి విప్లవంలో విద్యార్థుల పాత్ర ఎంత కీలకమో ‘విరాటపర్వం’లో కామ్రేడ్‌ భారతక్క కూడా అంతే కీలకం’ అని రానా పేర్కొన్నారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి ప్రియమణికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

ప్రియమణి అసలు పేరు ప్రియా వాసుదేవ్‌ మణి అయ్యర్‌. 1984 జూన్‌ 4న బెంగళూరులో ఆమె జన్మించారు. నటన మీద ఉన్న ఆసక్తితో ఉన్నత చదువుల అనంతరం ఆమె మోడలింగ్‌ రంగంలోకి అడుగుపెట్టారు. 2003లో విడుదలైన ‘ఎవరే.. అతగాడు’ చిత్రంతో ప్రియమణి కథానాయికగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందనలు అందుకుంది. అనంతరం ఆమె పలు తమిళ, తెలుగు, కన్నడ, మలయాళీ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ‘విరాటపర్వం’ చిత్రంతోపాటు కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘తలైవి’లో నటిస్తున్నారు.మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని