ఆగస్టు నుంచి ‘సీటీమార్‌’
close
Updated : 13/06/2020 18:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆగస్టు నుంచి ‘సీటీమార్‌’

హైదరాబాద్‌: గోపీచంద్‌ హీరోగా సంపత్‌ నంది తెరకెక్కిస్తోన్న చిత్రం ‘సీటీమార్‌’. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. తమన్నా కథానాయిక. తాజా చిత్రం నుంచి ఆయన కొత్త లుక్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.  నిర్మాత మాట్లాడుతూ ‘‘కబడ్డీ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమిది. ఆంధ్ర కబడ్డీ కోచ్‌గా గోపీచంద్‌, తెలంగాణ కబడ్డీ కోచ్‌గా తమన్నా  కనిపిస్తారు’’

‘‘మరో నాయిక దిగంగన ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. లాక్‌డౌన్‌కు ముందే 60శాతం చిత్రీకరణ పూర్తయింది. మిగిలిన భాగాన్ని ఆగస్టు తొలి వారం నుంచి   ప్రారంభించి ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేస్తాం. మణిశర్మ సారథ్యంలో నాలుగు గీతాలు రికార్డు చేశాం. ప్రస్తుతం ఆయన ఓ ఐటెం గీతాన్ని కంపోజ్‌ చేస్తున్నార’’న్నారు. పోసాని కృష్ణ ముర‌ళి, రావు ర‌మేష్‌, భూమిక‌, రెహ‌మాన్, బాలివుడ్ యాక్ట‌ర్ త‌రుణ్ అరోరా తదితరులు కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు.



మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని