నా శత్రువు కూడా అలాంటి బాధ పడకూడదు
close
Published : 05/01/2020 22:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా శత్రువు కూడా అలాంటి బాధ పడకూడదు

రకుల్‌ మీకు చెప్పిందో లేదో.. కానీ: మంచులక్ష్మి

హైదరాబాద్‌: గడిచిన 2019 తన జీవితంలో ఓ చెత్త సంవత్సరమని నటి మంచులక్ష్మి అన్నారు. అంతేకాకుండా ఆ ఏడాదిలో తాను అనుభవించినన్ని బాధలు తన శత్రువులకు కూడా రాకూడదని ఆమె కోరుకుంటున్నారు. తాజాగా ఆమె ఇన్‌స్టా వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఇందులో భాగంగా ఆమె ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆ విశేషాలివి..

రామ్‌చరణ్‌ గురించి ఏమైనా చెప్పగలరు?

మంచులక్ష్మి: స్వీట్‌ హార్ట్‌

శ్రీనివాస్‌ అవసరాలతో కలిసి పనిచేయడం ఎలా ఉంది?

మంచులక్ష్మి: శ్రీనివాస్‌ చాలా తెలివైనవాడు. తన నటన చాలా అద్భుతంగా ఉంటుంది. 

కెరీర్‌, కుటుంబం.. ఈ రెండింటి మధ్యలో సందేశంలో ఉన్న ఓ 20 ఏళ్ల అమ్మాయికి మీరు ఎలాంటి సలహా ఇస్తారు?

మంచులక్ష్మి: తల్లిదండ్రులకు నీపై ప్రేమ ఉంటే ఎప్పటికీ నీతోనే ఉంటారు. కాబట్టి నువ్వు నీ కలలను సాకారం చేసుకుంటూ కెరీర్‌పై దృష్టి పెట్టు.

ఈ ప్రపంచాన్ని ఫేస్‌ చేయడానికి ఒక మహిళకు ఉండాల్సిన లక్షణం ఏమిటి?

మంచులక్ష్మి: నీకోసం నువ్వు నిలబడు.

చర్మ సౌందర్యానికి సంబంధించిన టిప్స్‌ ఏమైనా ఇవ్వగలరు?

మంచులక్ష్మి: క్లీన్సింగ్‌, టోనింగ్, మాయిశ్చరైజింగ్‌ ఈ మూడు ప్రాథమికమైనవి. వీటిని కనుక వారంలో రెండు సార్లు ఫాలో అయితే అందమైన చర్మకాంతిని పొందవచ్చు. 

మీ డైట్‌ సీక్రెట్‌ చెప్పగలరు?

మంచులక్ష్మి: నేను ఫాలో అయ్యే డైట్‌ చాలా క్లిష్టమైనది. పాలియో డైట్‌ చాలామందికి సెట్‌ అవుతోందని నేను నమ్ముతాను

2020లో మీరు తీసుకున్న రెసల్యూషన్‌ ఏంటి?

మంచులక్ష్మి: ప్రతిరోజూ కనీసం 5 నిమిషాలలైనా ఆధ్యాత్మిక సాధనలో గడపాలనుకుంటున్నాను.

మీకు స్ఫూర్తి ఎవరు?

మంచులక్ష్మి: మా నాన్న మోహన్‌బాబు

ఉపాసన గురించి ఒక్కమాటలో చెప్పండి?

మంచులక్ష్మి: మంచి వ్యక్తి. ఏం సాయం కావాలన్న చేస్తుంది.

మీ కుమార్తెకు చెప్పే మంచి విషయం?

మంచులక్ష్మి: ఎవరినైనా కలిసినప్పుడు చిరునవ్వుతో పలకరించాలి.

మంచు విష్ణు, మనోజ్‌ ఎవరో ఒక్కరిని సెలెక్ట్‌ చేయండి?

మంచులక్ష్మి: నేను ఎలా చేయగలను. వాళ్లిద్దరు నాకిష్టం

రకుల్‌ గురించి ఎవరికీ తెలియని ఒక విషయం చెప్పండి?

మంచులక్ష్మి: తను మీకు ఈ విషయం చెప్పిందో లేదో నాకు తెలియదు. తను వెజటేరియన్‌గా మారింది. దీనివల్ల నేను చాలా బాధపడుతున్నాను. కానీ గర్వంగా ఫీల్‌ అవుతున్నాను.

2019లో మీ జీవితంలో జరిగిన మంచి విషయం ఏమిటి?

మంచులక్ష్మి: నా జీవితంలో చెత్త సంవత్సరం 2019. నా శత్రువు కూడా నేను అనుభవించిన బాధను ఫేస్ చేయకూడదు.

టాలెంట్‌ ఉన్న నటీనటులతో మీరు కొత్త ప్రాజెక్ట్‌ ప్రారంభించవచ్చు కదా? ఎందుకంటే ఇండస్ట్రీలో పురుషాధిక్యత ఎక్కువైంది?

మంచులక్ష్మి: నేను ఎప్పుడూ కొత్త నటీనటులను ప్రోత్సహిస్తుంటాను. మగవాళ్లు కాదు, ఆడవాళ్లు కాదు, కేవలం కొత్త టాలెంట్‌ మాత్రమే

మీ అభిమాన నటి, నటుడు ఎవరు?

మంచులక్ష్మి: అభిమాన నటి, నటుడు అనేది సినిమాల మీద ఆధారపడి ఉంటుంది. వాళ్లు చేసే పాత్రను బట్టి నాకు నచ్చుతారు. ఇటీవల నాకు సమంత చేసిన పాత్రలు బాగా నచ్చాయి. తను నటించిన పాత్రలను నేను ఎంజాయ్‌ చేశాను.

అఖిల్‌ గురించి ఒక్కమాట..?

మంచులక్ష్మి: స్వీట్‌ కానీ నాటీ

మీ జీవితాన్ని అంత సంతోషంగా గడపడానికి కారణమేమిటి?

మంచులక్ష్మి: మనకి ఉన్నది ఒక్కటే జీవితాన్ని దాన్ని పూర్తిగా జీవించాలి అనే విషయాన్ని నేను చాలా త్వరగా తెలుసుకున్నాను.

మీ అలవాట్లు ఏమిటి?

మంచులక్ష్మి: సినిమాలు చూడడం, స్నేహితులతో సరదాగా గడపడం

మీరు మళ్లీ పాట ఎప్పుడు పాడతారు?

మంచులక్ష్మి: నాకు పాడాలి అనిపించినప్పుడు పాడతాను.

నెగిటివిటిని దూరంగా ఉంచుకోవాలంటే ఎం చేయాలి?

మంచులక్ష్మి: మిమ్మల్ని మీరు పాజిటివిటితో నింపుకున్నప్పుడు నెగిటివిటి మీ దగ్గరికి కూడా రాలేదు

మీ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే విషయం?

మంచులక్ష్మి: చాలా ఉన్నాయి. వాటిలో నిర్వాణ పుట్టిన రోజును ఎప్పటికీ మర్చిపోలేను.

వృత్తిపరమైన, వ్యక్తిగతమైన జీవితాన్ని ఎలా మేనేజ్‌ చేయగలుగుతున్నారు? దానివల్ల మీరు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారా?

మంచులక్ష్మి: జీవితాన్ని ప్రేమిస్తే ఏదైనా సంతోషంగా ఉంటుంది 

రకుల్‌ గురించి ఒక్కమాటలో చెప్పండి?

మంచులక్ష్మి: నా జీవితానికి దొరికిన మంచి స్నేహితురాలు

ఎలాంటి ఆహారాన్ని ఇష్టపడతారు?

మంచులక్ష్మి: ఇంటి భోజనాన్ని ఇష్టపడతాను. పప్పు, చికెన్‌, రసం

మీరు మాట్లాడే ఇంగ్లీష్‌ అంటే నాకు ఇష్టం. మీలా ఇంగ్లీష్‌ మాట్లాడలంటే ఏం చేయాలి?

మంచులక్ష్మి: మీకు ఇష్టమైన ఇంగ్లీష్‌ ప్రోగ్రామ్స్‌ను చూస్తూ ఉండండి

మీరే ఒక యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించవచ్చు కదా?

మంచులక్ష్మి: ఈ ఏడాది తప్పకుండా ఒకటి ప్రారంభిస్తాను.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని