మహేశ్‌బాబును తెగ విసిగించా!
close
Updated : 07/01/2020 19:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహేశ్‌బాబును తెగ విసిగించా!

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో రష్మిక టైమింగ్‌ అద్భుతంగా ఉంటుందని, మేనరిజమ్స్‌ అలరిస్తాయని అన్నారు దర్శకుడు అనిల్‌ రావిపూడి. ఆయన దర్శకత్వంలో మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన చిత్రమిది. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అనిల్‌ రావిపూడి, రష్మిక కలిసి ప్రత్యేకంగా ముచ్చటించారు. దర్శకుడు అనిల్‌ ప్రతి పాత్రనూ నటించి చూపిస్తారని రష్మిక తెలిపింది. తెరపై తాము పలికించే ప్రతి హావభావాలు దర్శకుడు చెప్పినవేనని, అందుకు ఆయనకు 10/10 మార్కులు ఇస్తానని చెప్పుకొచ్చింది. ఈ సినిమా షూటింగ్‌ సందర్భంగా మహేశ్‌బాబుని చాలా విసిగించానని అయితే, ఆయన మాత్రం ‘చిన్న పిల్ల అల్లరి చేస్తోంది.. పోనీయండి’ అని వదిలేసేవారని నవ్వుతూ చెప్పింది. ఇంకా ఆమె పంచుకున్న విశేషాలను ఈ వీడియోలో చూడండి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని