మా నాన్న సినిమాలన్నీనా ఫేవరెట్టే: సితార
close
Updated : 10/01/2020 14:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మా నాన్న సినిమాలన్నీనా ఫేవరెట్టే: సితార

ఆద్యా, సితారతో రష్మిక సందడి

హైదరాబాద్‌: టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు గారాలపట్టి సితార, దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్తె ఆద్యా.. వీరిద్దరు కలిసి ‘A&S’ పేరుతో ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా వీరిద్దరు ‘సరిలేరు నీకెవ్వరు’ హీరోయిన్‌ రష్మికను సరదాగా ఆటపట్టించారు. అంతేకాకుండా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి సంబంధించిన విషయాలను రష్మిక, సితార అభిమానులతో పంచుకున్నారు. అయితే తన తండ్రి మహేశ్‌ నటించిన చిత్రాలన్నీ తన అభిమాన సినిమాలేనని అంటున్నారు సితార. ఆ విశేషాలివే.. 

సితార: మా నాన్నతో కలిసి పనిచేయడం ఎలా ఉంది?

రష్మిక: మహేశ్‌బాబుతో వర్క్‌ అని చెప్పగానే మొదట భయపడ్డాను. ఎందుకంటే ఆయన సూపర్‌స్టార్‌ కాబట్టి. సెట్‌లో ఆయన్ని కలిశాకా సినిమా షూటింగ్‌ మొత్తం చాలా సరదాగా గడిచింది. సెట్‌లో ఎప్పుడూ నేను చాలా అల్లరి చేసేదాన్ని. (సితార మధ్యలో అందుకుని.. మీరు టామ్‌బాయ్‌ లాంటివారు కదా).

ఆద్యా: ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో పనిచేయడం ఎలా ఉంది?

రష్మిక: ఇది నా మొదటి పెద్ద సినిమా అని అందరూ అన్నారు. దీంతో నేను కూడా టాలెంట్‌ను చూపించాలనుకున్నా. సెట్‌లోకి వెళ్లాక అందరూ పెద్ద పెద్ద నటీనటులు. చాలా భయం వేసింది. పైకి చాలా ధైర్యంగా కనిపించే దాన్ని.. కానీ లోపల మాత్రం భయపడేదాన్ని.

సితార: ‘సరిలేరు నీకెవ్వరు’లో మీకు బాగా నచ్చిన సన్నివేశం ఏది?

రష్మిక: క్లైమాక్స్‌.. (మధ్యలో సితార అందుకుని క్లైమాక్స్‌ ఏంటో చెప్పండి అని అడగగా.. నో నేను చెప్పలేను. య్యూటూబ్‌లో మీకు చాలామంది అభిమానులు ఉన్నారు. నేను కనుక చెబితే ఈ వీడియో చూసిన అందరికీ క్లైమాక్స్‌ తెలిసిపోతోంది.)

ఆద్యా: డ్యాన్స్‌ని బాగా ఎంజాయ్‌ చేశారా?

రష్మిక: డ్యాన్స్‌ కోసం చాలా కష్టపడ్డాను. మొదటిసారి ఈ సినిమాలోనే నేను డ్యాన్స్‌ చేశాను. సూపర్‌స్టార్‌తో కలిసి డ్యాన్స్‌ చేయడం కష్టంగా అనిపించింది.

సితార : ఈ సినిమాలో ‘మైండ్‌ బ్లాక్‌’ సాంగ్‌లో డ్యాన్స్‌ చేసిన తర్వాత.. ‘నాకు ఊపిరిరాడడం లేదు బాబోయ్‌’ అని కూర్చుని పోయారు కదా..!

రష్మిక:  మీకు ఎవరు చెప్పారు. (నవ్వులు)

సితార: ఈ సినిమాలో మీకు నచ్చిన పాట?

రష్మిక: సరిలేరు నీకెవ్వరు యాంథమ్‌.(మధ్యలో సితార అందుకుని మా నాన్నతోపాటు మీరు కూడా ఉన్న పాట చెప్పండి..? అలా అయితే నాకు ‘He is soo Cute’ అని రష్మిక తెలిపింది.)

రష్మిక: ఇంతకీ నీకు ఏ పాట ఇష్టం సితార..?

సితార: మైండ్‌ బ్లాక్‌ సాంగ్‌ 

ఆద్యా: He is soo Cute

రష్మిక: మీకు య్యూటూబ్‌ ఛానెల్‌ పెట్టాలనే ఐడియా ఎలా వచ్చింది?

ఆద్యా: మా ఇద్దరికీ యూట్యూబ్‌ ఛానెల్‌ పెట్టాలనే ఆలోచన ఉండేది. మేమిద్దరం కలిసి ఎదో ఒక వీడియో చేస్తుండేవాళ్లం. మేము ఒక వీడియో చేస్తే అది రామ్‌ అంకుల్‌ చూశారు. ఆయనే చెప్పారు యూట్యూబ్‌ ఛానెల్‌ స్టార్ట్‌ చేయమని. అలా మేం స్టార్ట్‌ చేశాం.

సితార: అప్పుడు నేను ‘A&S’ అనే పేరు పెట్టాను. 

రష్మిక: మీ ఫేవరెట్‌ సినిమా ఏది..?

సితార: మా నాన్న సినిమాలన్నీ నా అభిమాన చిత్రాలే. ఆయన నటించిన ఏ సినిమా విడుదలైతే అదే నా ఫేవరెట్‌ మూవీ.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని