ఎన్టీఆర్‌ టపాకాయలాంటి వాడు: రామ్‌చరణ్‌
close
Published : 17/01/2020 17:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎన్టీఆర్‌ టపాకాయలాంటి వాడు: రామ్‌చరణ్‌

అతడు సెట్‌లో ఉంటే..!

హైదరాబాద్‌: తన స్నేహితుడు ఎన్టీఆర్‌ ఎనర్జీని కథానాయకుడు రామ్‌ చరణ్‌  మెచ్చుకున్నారు. వీరిద్దరూ కలిసి నటిస్తున్న భారీ ప్రాజెక్టు ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’. అల్లూరి సీతారామరాజుగా చెర్రీ, కొమరం భీమ్‌గా తారక్‌ కనిపించనున్నారు. ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దానయ్య నిర్మాత. చరణ్‌కు జోడీగా అలియా భట్‌, ఎన్టీఆర్‌ సరసన ఒలివియా మోరిస్‌ నటిస్తున్నారు. దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ సినిమా గురించి చెర్రీ తాజాగా ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడారు. జక్కన్న చెప్పిన విధంగా ఫాలో అవుతున్నట్లు పేర్కొన్నారు.

గౌరవంగా భావిస్తున్నా

అల్లూరి పాత్రను పోషించడం గురించి మాట్లాడుతూ.. ‘తెలుగు రాష్ట్రాల చరిత్రలో అల్లూరి సీతారామరాజు పాత్ర చాలా కీలకం. ఇది ఎంతో పవర్‌ఫుల్‌ పాత్ర, దాన్ని నేను పోషిస్తుండటం గౌరవంగా భావిస్తున్నా. ఆయనలా కనిపించేందుకు నేను చాలా సాధన చేశా, ఎంతో కష్టపడ్డా. షూట్‌కు ముందు హోమ్‌వర్క్‌ చేయడంతోపాటు వర్క్‌షాప్‌లకు కూడా హాజరయ్యా. ప్రత్యేక సినిమాలోని.. ప్రత్యేక పాత్ర ఇది’.

ఒత్తిడి తీసుకోను..

పాత్రలో నటించడం గురించి ప్రస్తావిస్తూ.. ‘పాత్ర ఏదైనా సరే నేను ఒత్తిడి మొత్తం నాపై వేసుకోను. నా మీద అనవసరమైన ఒత్తిడి పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే దాన్ని పెట్టుకుని.. పనిచేసిన ప్రతిసారి తప్పులు చేశా. ‘రంగస్థలం’ సినిమా తర్వాత.. వినికిడిలోపం ఉన్న వ్యక్తి పాత్రలో నటించేందుకు ఎలాంటి సాధన చేశావని చాలా మంది అడిగారు. నిజం ఏంటంటే.. దాని కోసం నేను ఏ మాత్రం సాధన చేయలేదు’.

అది ముఖ్యం  

తన ఆలోచనలు, అభిప్రాయాల కన్నా దర్శకుడి విజన్‌ను అనుసరించడం ముఖ్యమని చరణ్‌ అన్నారు. ‘‘నటన విషయానికి వచ్చే సరికీ నేను దర్శకుడి హీరోని. దర్శకుడితో మాట్లాడి, పాత్ర ఏంటో అర్థం చేసుకుంటా. దానికి నేనేం చేయాలో ఆలోచిస్తా. పాత్రను ఈ రకంగా చేస్తే బాగుంటుందని నేను అనుకుని చేయడం కన్నా.. దర్శకుడి ఆలోచనల్ని బట్టి ఆయనకేం కావాలో చూడటం ముఖ్యం’.

సెట్‌లో సందడే..

స్నేహితుడు తారక్‌తో బంధం గురించి మాట్లాడుతూ.. ‘మన్నెంలో అల్లూరు సీతారామరాజు ఎలాగో.. తెలంగాణలో కొమరం భీమ్‌ అలా. ఎన్టీఆర్‌ టపాకాయలాంటి వాడు. అతడు చాలా ఎనర్జిటిక్‌గా ఉంటాడు. అతను సెట్‌లో ఉంటే చాలా సరదా, సందడిగా ఉంటుంది. తను నా చుట్టుపక్కల లేకపోతే.. మిస్‌ అవుతున్న భావన కలుగుతుంది. ఈ సినిమా కోసం కలవడానికి ముందే నేను, ఎన్టీఆర్‌ మంచి స్నేహితులం. ఆ బంధం షూటింగ్‌ సమయంలో బాగా నటించేందుకు ఉపయోగపడుతోంది. మా ఇద్దరిదీ గొప్ప ప్రయాణం’.

ఆమె నటన ఇష్టం

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమాలో సీతగా నటిస్తున్న బాలీవుడ్‌ నటి అలియా భట్‌ గురించి ప్రశ్నించగా చరణ్‌ స్పందించారు. ‘‘నేను అలియా భట్‌తో కలిసి ఇంకా షూటింగ్‌లో పాల్గొనలేదు. ఆమె నటనకు నేను అభిమానిని. ఓ నటిగా ఆమె ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఆలియాతో కలిసి పనిచేయడం కోసం ఎదురుచూస్తున్నా’ అని ఆయన పేర్కొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని