అదే నాకు వచ్చిన బెస్ట్‌ కాంప్లిమెంట్‌..!
close
Published : 18/01/2020 14:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అదే నాకు వచ్చిన బెస్ట్‌ కాంప్లిమెంట్‌..!

మహేశ్‌ను ఇంటర్వ్యూ చేసిన సితార, ఆద్యా

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మరో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేశ్‌ మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. ఈ నేపథ్యంలో మహేశ్‌ను ఆయన కుమార్తె సితార, దర్శకుడు వంశీ పైడిపల్లి కుమార్తె ఆద్యా మహేశ్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఆ విశేషాలివే..

‘సరిలేరు నీకెవ్వరు’తో మంచి విజయాన్ని అందుకున్న సందర్భంగా ఓ స్పెషల్‌ కార్డ్‌ను సితార, ఆద్యా తయారు చేసి మహేశ్‌కు గిఫ్ట్‌గా అందించారు. గిఫ్ట్‌ చూసిన మహేశ్‌ చాలా సంతోషించి.. ‘ఈ కార్డ్‌ను నేను ఫ్రేమ్‌ కట్టించి స్టడీ రూమ్‌లో పెట్టుకుంటాను’ అని తెలిపారు.

సితార: ఆర్మీ అధికారి పాత్రలో నటించడం ఎలా ఉంది?

మహేశ్‌: ఆర్మీ అధికారి పాత్రలో నటించడం చాలా గర్వంగా ఉంది. ఆర్మీ వాళ్లు లేకపోతే మనం ఇక్కడ ఇంత సంతోషంగా ఉండేవాళ్లం కాదు.

ఆద్యా: ఆ పాత్రను పోషించడం ఛాలెంజ్‌గా అనిపించిందా?

మహేశ్‌: మేజర్‌ అజయ్ కృష్ణ పాత్రను పోషించడం ఛాలెంజ్‌గా అనిపించలేదు. ఈ సినిమా షూటింగ్‌ కశ్మీర్‌లో చిత్రీకరించాం. ఆ సమయంలో కొంతమంది ఆర్మీ వాళ్లతో మాట్లాడాను. ఈ షూటింగ్‌ ఎప్పటికీ  గుర్తుండిపోతుంది. 

మహేశ్‌: కశ్మీర్‌ షూటింగ్‌కి నువ్వు కూడా వచ్చావ్‌ కదా. అక్కడ మనం సితార పుట్టినరోజును సెలబ్రేట్‌ చేశాం. మరి నీ అనుభవం ఎలా ఉంది?

ఆద్యా: చాలా అద్భుతంగా ఉంది

సితార: బాంబ్‌ పేలగానే జాతీయ పతాకం రంగులు రావడం.. ఎలా అనిపించింది?

మహేశ్‌: ఆ ఐడియా మా డైరెక్టర్‌ది. అది మొత్తం కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌లో చేశాం. (మధ్యలో సితార అందుకుని అది చూసి అందరూ వావ్‌ అన్నారు. వెంటనే మహేశ్‌.. నన్ను కొంచెం మాట్లాడని.. (నవ్వులు))

సితార: ఈ సినిమా మొత్తంలో ట్రైన్‌ సీక్వెన్స్‌ చాలా ఫన్నీగా ఉంటుంది. మరి షూటింగ్‌ సమయంలో ఎలా అనిపించింది?

మహేశ్‌: ఆ ట్రైన్‌ సీక్వెన్స్‌ షూటింగ్‌ చాలా ఫన్నీగా సాగింది. ట్రైన్‌ సీక్వెన్స్‌లోని ప్రతి సీన్‌ షూట్‌ అవ్వగానే మేమద్దరం బాగా నవ్వుకునే వాళ్లం. అది చాలా గ్రేట్‌ టైమ్‌.

ఆద్యా: ఎప్పుడైనా ట్రైన్‌ జర్నీ చేశారా..?

మహేశ్‌: ఆ.. చాలా సంవత్సరాల క్రితం చిన్నప్పుడు ట్రైన్‌ జర్నీ చేశాను. మా డైరెక్టర్‌ అనిల్‌రావిపూడికి ట్రైన్‌ జర్నీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయనకు ఫ్లైట్స్‌ అంటే ఇష్టముండదు. 

ఆద్యా: ఈ సినిమాలో మీకు నచ్చిన పంచ్‌ డైలాగ్‌..?

మహేశ్‌: ‘మీరందరూ నేను కాపాడుకునే ప్రాణాలు’ ఆ డైలాగ్‌ అంటే నాకు బాగా ఇష్టం

మహేశ్‌: మరి నీ ఫేవరెట్‌ డైలాగ్‌ ఏది?

ఆద్యా: మియావ్‌ మియావ్‌ పిల్లి.. మిల్క్‌ బాయ్‌తో పెళ్లి (నవ్వులు)

సితార: లుంగీలో డ్యాన్స్‌ చేయడం ఎలా ఉంది?

మహేశ్‌: బాగుంది‌. చాలా సంవత్సరాల తర్వాత నేను లుంగీలో డ్యాన్స్‌ చేస్తూ కనిపించాను. (మధ్యలో ఆద్యా అందుకుని ఈసారి మీరు లుంగీలో చాలా స్పెషల్‌గా కనిపించారు)

ఫేవరెట్‌ సీన్‌: ఇంటర్వెల్‌ సీన్‌

ఫేవరెట్‌ కలర్‌: వైట్‌

ఫేవరెట్‌ సాంగ్‌: మైండ్‌ బ్లాక్‌

ఫేవరెట్‌ ఫుడ్‌: ఏదైనా

అభిమానుల కోసం ఒక మాట: ఐ లవ్‌ దెమ్‌

ఈ నెలలో మీకు జరిగిన ఓ గొప్ప విషయం: జనవరి 11, సరిలేరు నీకెవ్వరు రిలీజ్‌. ఎప్పటికీ గుర్తుండే రోజు

ఫేవరెట్‌ కోస్టార్‌: చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం రష్మిక

ఇప్పటివరకూ మీరు నటించిన చిత్రాల్లో మీకు బాగా నచ్చిన మూవీ: సరిలేరు నీకెవ్వరు

ఇప్పటివరకూ మీకు వచ్చిన గొప్ప ప్రశంస: మా నాన్న నుంచి వచ్చింది. ఈ సినిమా చూశాక.. ఇప్పటివరకూ నేను నటించిన సినిమాలకంటే ఇందులో నా నటన చాలా బాగుందని చెప్పారు. అదే నాకు వచ్చిన గొప్ప ప్రశంస.

మహేశ్‌: ఈ సినిమా చూశాక మీకు ఎలా అనిపించింది?

సితార: మోస్ట్‌ ఎంటర్‌టైనింగ్‌ ఫిల్మ్‌. 

మహేశ్‌: నన్ను ఇంటర్వ్యూ చేయడం ఎలా ఉంది?

సితార: అద్భుతం

ఆద్యా: ముందు కొంచెం భయం వేసింది. కానీ ఇప్పుడు ఓకే. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని