‘సమంత’లాంటి అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటా
close
Published : 03/02/2020 10:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘సమంత’లాంటి అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటా

ఆయన్ని కలవకుండా తప్పించుకుని తిరిగా : సమంత

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిన్నపెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకున్న ప్రేమకావ్యం ‘96’. త్రిష, విజయ్‌ సేతుపతి జంటగా నటించిన ఈ కోలీవుడ్‌ సినిమాను ‘జాను’ పేరుతో తెలుగులో రీమేక్‌ చేసిన విషయం తెలిసిందే. సమంత, శర్వానంద్‌ కలిసి నటించిన ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ నేపథ్యంలో ‘జాను’ సినిమా గురించి సామ్‌, శర్వా సరదాగా ముచ్చటించారు. ఆ విశేషాలివే..

తమిళంలో మంచి విజయం సాధించిన ‘96’ సినిమాని రీమేక్‌ చేస్తున్నారు కదా.. మరి మీకు ఏమైనా భయం వేసిందా?

సమంత: ‘96’ ఓ క్లాసిక్‌ మూవీ. ఆ సినిమా చూశాక.. ‘ఇలాంటి క్లాసిక్‌ సినిమాల్ని ఎవరూ టచ్‌ చేయకూడదు.’ అని నేనే ట్వీట్‌ చేశాను. అలాంటి ఈ సినిమా ఒప్పుకొన్నాక చాలా భయం వేసింది. నిద్రపట్టేది కాదు. ఒక్కొసారి మా మేనేజర్‌కు ఫోన్‌ చేసి ‘జాను’ చేయనని చెప్పేదాన్ని. నా మాటలు విని మా మేనేజర్‌ భయపడిపోయారు. ‘మేడమ్‌.. నాకు హార్ట్‌ ఎటాక్‌ తెప్పిస్తున్నారు’ అని అనేవారు(నవ్వులు)

శర్వానంద్‌: ఇప్పటికీ మా ఇద్దరిలో చాలా భయం ఉంది. మా సినిమా టీజర్‌, ట్రైలర్లు వచ్చినప్పుడు మా గురించి ఎలాంటి ట్రోల్స్‌ వస్తాయో అని భయపడ్డాం.

‘96’ సినిమాలో త్రిష పేరు ‘జాను’. ఆ సినిమాలో ‘జాను’ పేరు చాలా చోట్ల వినిపిస్తుంది. అలా మీరు ఈ సినిమాకి ‘జాను’ టైటిల్‌ పెట్టారా?

శర్వానంద్‌: త్రిష, విజయ్‌సేతుపతి చాలా పెద్ద స్టార్స్‌. ‘96’ సినిమాలో వాళ్లిద్దరూ చక్కగా నటించారు. కెరీర్‌ పరంగా చూసుకుంటే వాళ్లు మాకంటే పదేళ్లు ముందే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ‘జాను’ సినిమాని చాలా ఎమోషనల్‌గా తెరకెక్కించాం. ‘జాను’ నవతరానికి సంబంధించిన స్టోరీ. మా సినిమాలో స్కూల్‌ రీయూనియన్‌లో కలిసేది 96 బ్యాచ్‌ కాదు. 2004 బ్యాచ్‌. అలా చూసుకున్నా మాది కొంచెం యంగ్‌ జనరేషన్‌గా ఉంటుంది.

‘జాను’ సినిమాలో ప్రధానాంశం లవ్‌. రామ్‌ మిస్‌ అయిన జాను. పదో తరగతిలో ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకునే వాళ్లు వందలో ఐదుశాతం మంది కూడా ఉండకపోవచ్చు. ప్రతి ఒక్కరి జీవితంలో ఫస్ట్‌ లవ్‌ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అందుకే మా సినిమాకి అందరూ కనెక్ట్‌ అవుతారని నేను ఫీల్ అవుతున్నాను. 

మీ జీవితంలో ఏమైనా ప్రేమకథలు ఉన్నాయా?

శర్వానంద్‌: అలాంటి ఏం లేవు.

సమంత: బోరింగ్‌ అనే పదంలో క్యాపిటల్‌ ‘బి’ అనే లెటర్‌ శర్వాకు కరెక్ట్‌గా సెట్‌ అయ్యింది. ఒక లవ్‌ స్టోరీ లేదు. ఒక లవ్‌ లేదు.

మీరు అన్నీ సినిమాల్లో డైలాగులను చాలా ఫీల్‌ అయ్యి మరి చెబుతారు కదా..! నిజంగానే ప్రేమకథలు లేవా?

సమంత: నాకు అదే అనిపించింది. సినీ పరిశ్రమలో ఉన్న చాలామందికి సంబంధించిన రూమర్స్‌ వస్తుంటాయి కదా అని చెప్పి ఒకరోజు నేను శర్వానంద్‌ గురించి గూగుల్‌లో సెర్చ్‌ చేశాను. కానీ ఏం రాలేదు.

ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు?

శర్వానంద్‌: ఇప్పటివరకూ నాకు ప్రేమకథలు లేవు. కానీ నేను ‘మజిలీ’ సినిమాలో సమంత లాంటి అమ్మాయి దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటా. భర్త ఏం చేసినా తను చాలా సైలెంట్‌గా ఉంటుంది. భర్తని బాగా చూసుకుంటుంది.

ఫస్ట్‌ డే షూటింగ్‌ ఎలా ఉంది?

సమంత: ఫస్ట్‌డే ‘జాను’ సెట్‌కి వెళ్లగానే కొంచెం భయంగా అనిపించింది. కానీ సెట్‌లో నా ఫస్ట్‌ సీన్‌ వచ్చేసి.. స్కూల్‌ రీయూనియన్‌. ఆ షాట్‌ అవ్వగానే దేవుడికి దణ్ణం పెట్టుకున్నాను. ఇలాంటి మంచి క్లాసిక్‌ సినిమాని నాకు అందించినందుకు.

‘96’ త్రిష నటన మీకు ఏమైనా ఉపయోగపడిందా?

సమంత: త్రిష నటన చాలా అద్భుతంగా ఉంటుంది. ‘జాను’ సినిమాని ఒప్పుకోక ముందు నేను ‘96’ చిత్రాన్ని ఒక్కసారి చూశాను. ఆ తర్వాత ‘జాను’ చిత్రానికి సంతకం చేశాక ఆ సినిమాని చూడలేదు. ఎందుకంటే ఎక్కువగా చూస్తే మనకి తెలియకుండానే మనం వాళ్లని ఫాలో అయిపోతుంటాం. అంతేకాకుండా సెట్‌లో ఏవరైనా ‘96’ సినిమాని చూస్తున్నా సరే అక్కడి నుంచి పారిపోయేదాన్ని.

శర్వానంద్‌ నటన ఎలా ఉంటుంది?

సమంత: శర్వానంద్‌ చాలా గొప్ప నటుడు. అతను నటించిన చాలా సినిమాలు నేను చూశాను. కానీ, ఈ సినిమాలో మాత్రం శర్వా నటన చాలా అద్భుతంగా ఉంటుంది. సీన్‌కి కనెక్ట్‌ అయితే ఆటోమేటిక్‌గా కన్నీళ్లు పెట్టుకుంటాడు. శర్వాలాంటి నటుడ్ని ఇప్పటివరకూ చూడలేదు. టాలీవుడ్‌లో ఉన్న టాప్‌ ఫైవ్‌ బెస్ట్‌ యాక్టర్స్‌లో శర్వా ఒకరు. శర్వా సపోర్ట్‌ వల్లే నేను బాగా చేయగలిగాను.

షాట్‌ సరిగ్గా రాకపోతే ఏం చేస్తారు?

సమంత: నాకు కనుక షాట్‌ సరిగ్గా రాలేదనిపిస్తే.. డైరెక్ట్‌గా నచ్చలేదని చెప్పేస్తాను.

శర్వానంద్‌: సమంతతోపాటు ఆమె టీంను చూసి నేను, నా టీం చాలా మారాం. 

దిల్‌రాజుతో పనిచేయడం ఎలా ఉంది?

శర్వానంద్‌: రాజన్న నా కుటుంబంలో ఒక వ్యక్తిలాంటివారు. రాజన్న నన్ను కలిసి ‘96’ సినిమా చెప్పగానే.. క్లాసిక్‌ మూవీ చేయాలా? వద్దా? అని బాగా ఆలోచించాను. ఆయన వెంటనే చేయమని చెప్పారు. ఆయన కోసమే ‘జాను’ సినిమా చేశాను. ఆయన జడ్జిమెంట్‌ మీద నాకు అంత నమ్మకం ఉంది.

సమంత: రాజు గారు ‘96’ రీమేక్‌ గురించి మా మేనేజర్‌కు ఫోన్‌ చేశారు. నాకు చాలా భయం వేసి చాలా రోజులు ఆయనకు మా మేనేజర్‌తో అబద్ధాలు చెప్పించాను. ఊర్లో లేరు, ఆరోగ్యం బాలేదు.. ఇలా చెప్పించేదాన్ని. అలా చాలా రోజుల తర్వాత ఓ రోజు కలిశాను. చేస్తాను అని చెప్పాను. ఆయన అడిగితే తప్పకుండా ఒప్పుకుంటాను.

మాతృకను డైరెక్ట్‌ చేసిన ప్రేమ్‌కుమార్‌ ‘జాను’ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆయన డైరెక్షన్‌ ఎలా అనిపించింది?

శర్వానంద్‌: ఆయన చాలా మంచి డైరెక్టర్‌. ‘జాను’ సినిమాకు ఆయనను తీసుకోవడం మంచి నిర్ణయం. ఈ సినిమాలోని ఫస్ట్‌ సాంగ్‌ను 20 డేస్‌ షూట్‌ చేశాం.

 

 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని