మహేశ్‌బాబు ఒక్కరోజు సీఎం అయితే..
close
Published : 18/02/2020 12:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహేశ్‌బాబు ఒక్కరోజు సీఎం అయితే..

తాను ఒక రోజు ముఖ్యమంత్రి అయితే, రాష్ట్రాన్ని ఆ దేవుడే కాపాడాలని అంటున్నారు అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేశ్‌బాబు బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆయన కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్తున్నారు. కొన్ని రోజుల విరామం అనంతరం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రంలో నటిస్తారు. తాజాగా ఆయన ఓ ఆంగ్ల పత్రికకు చిన్న ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వీడియోను నమ్రత అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు మహేశ్‌ తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. 

మహేశ్‌బాబు గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే..

మహేశ్‌బాబు: అణకువ.. వినయం.. విధేయత

మీ కెరీర్‌లో లేదా సినిమా సెట్‌లో ఎప్పటికీ మర్చిపోలేని సంఘటన

మహేశ్‌బాబు: సినిమాలో, సెట్‌లో అలాంటివి ఏవీ లేవు. అప్పట్లో ప్రతి సినిమా విడుదలైన తర్వాత సుదర్శన్‌ 35లో నాన్నతో కలిసి చూసేవాడిని. ‘మురారి’ సినిమా చూసిన తర్వాత నాన్న నా భుజంపై చేయి వేసి తట్టారు. ఆ క్షణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. 

మీ ఉద్దేశంలో పర్‌ఫెక్ట్ రొమాంటిక్‌ డేట్‌?

మహేశ్‌బాబు: నా భార్యతో కలిసి మంచి సినిమా చూడటం. 

మిమ్మల్ని చికాకు పెట్టేది ఏంటి?

మహేశ్‌బాబు: నీతి, నిజాయతీలేని వ్యక్తులు 

యువ మహేశ్‌బాబు గురించి మూడు ముక్కల్లో చెప్పమంటే..

మహేశ్‌బాబు: మా అబ్బాయి. తండ్రిలా ఉండమని చెబుతా. 

మీ జీవిత కథతో బయోపిక్‌ తీస్తే, దానికి ఏం పేరు పెడతారు. ఎవరు మీ పాత్రను పోషిస్తే బాగుంటుంది. 

మహేశ్‌బాబు: నాది చాలా చిన్న జీవితం.. పైగా బోరింగ్‌. నాపై బయోపిక్‌ పెద్ద వర్కవుట్‌ అవుతుందని నేను అనుకోవడం లేదు. 

మీ దృష్టిలో మంచి విహారయాత్ర అంటే?

మహేశ్‌బాబు: నా పిల్లలు, భార్యతో కలిసి విహారయాత్రకు వెళ్లడం చాలా బాగుంటుంది. 

మీ ఫ్యాన్స్‌లో ఎవరైనా మీకోసం క్రేజీగా చేశారా?

మహేశ్‌బాబు: నా కెరీర్‌ ప్రారంభించిన కొత్తలో వేలల్లో మెయిల్స్‌, లెటర్స్‌ వచ్చేవి. అందులో ఒక లెటర్‌ రక్తంతో రాశారు. అది ఎప్పటికీ మర్చిపోలేను. నిజంగా క్రేజీగా అనిపించింది. 

మీరు ఒక రోజు సీఎం అయితే, మొదటిగా చేసే పని ఏంటి?

మహేశ్‌బాబు: నాకూ తెలియదు. దేవుడే రాష్ట్రాన్ని రక్షించాలి. 

ముగ్గురు నటులతో కలిసి రోడ్‌ ట్రిప్‌ వెళ్లమంటే ఎవరితో వెళ్తారు?

మహేశ్‌బాబు: చరణ్‌, తారక్‌, అందరినీ సమన్వయం చేయడానికి చిరంజీవి గారు..



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని