ఆ సినిమాలపై బోర్‌ కొట్టేసింది: నికిషా పటేల్‌
close
Updated : 03/03/2020 16:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ సినిమాలపై బోర్‌ కొట్టేసింది: నికిషా పటేల్‌

అందుకే లండన్‌కి షిఫ్ట్‌ అయిపోయా

‘పవన్‌ హీరోయిన్‌’ అనడం మాత్రం ఆపలేదు!

హైదరాబాద్‌: తెలుగు, తమిళ సినిమాలంటే బోర్‌ కొట్టేసిందని, వాటిపై ఆసక్తి లేదని కథానాయిక నికిషా పటేల్‌ చెప్పారు. పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ‘పులి’ సినిమాతో నటిగా అరంగేట్రం చేసిన ఆమె.. ఆపై తెలుగుతోపాటు తమిళ, కన్నడ సినిమాల్లోనూ నటించారు. అయితే ఈ భామ ఇటీవల తిరిగి లండన్‌ షిఫ్ట్‌ అయ్యారు. అక్కడి బ్రిటిష్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇండస్ట్రీలో శిక్షణ తీసుకుంటున్నారు. తాజాగా ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నికిషా పటేల్‌ ఈ విషయాన్ని తెలిపారు. దక్షిణాది సినిమాలపై ఆసక్తిలేదని అన్నారు.

లండన్‌ స్వస్థలం

‘నేను తీసుకున్న అతి కష్టమైన నిర్ణయం ఇది. కానీ ఇదే సరైంది అనిపించింది. సెంట్రల్‌ లండన్‌లో ఓ ఇల్లు తీసుకుని గత కొన్ని నెలలుగా అక్కడే ఉంటున్నా. ఓ అంతర్జాతీయ ఏజెన్సీతో కలిసి పనిచేస్తున్నా. అన్నింటికన్నా మించి లండన్‌ నా స్వస్థలం. కాబట్టి ఎప్పటికైనా మారాల్సిందే’ అని చెప్పారు.

ఎంత కష్టపడినా..

అనంతరం దక్షిణాదిలో తనకు వచ్చిన అవకాశాల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘సౌత్‌లో 25 కంటే ఎక్కువ సినిమాలు చేశా. నాకు బోర్‌ కొట్టేసింది. నేను ఎంత కష్టపడి నటించినా.. సినిమాలు విమర్శలు ఎదుర్కొన్నాయి. కాబట్టి నాకు కాస్త విరామం కావాలి’ అని ఆమె అభిప్రాయపడ్డారు.

భారత్‌ రావడానికి కారణం అదే..

అనంతరం లండన్‌కు చెందిన తను అక్కడి నుంచి ఇండియాకు రావడానికి కారణం చెబుతూ.. ‘హిందీలో ఓ పెద్ద స్టార్‌, ప్రముఖ దర్శకుడితో కలిసి పనిచేయాలనే ఆశతో లండన్‌ నుంచి ఇండియాకి వచ్చా. కానీ అది జరగలేదు. బాలీవుడ్ దక్షిణాది పనిని ప్రశంసిస్తుంటుంది’ అని పేర్కొన్నారు.

మంచి ఆఫర్లు రాలేదు

సరైన పాత్రలు రాకపోవడం వల్లే దక్షిణాదిపై ఆసక్తి తగ్గిందని నికిషా పటేల్‌ వివరించారు. ‘దక్షిణాదిలో పాత్రల ఎంపిక విషయంలో నేను సర్దుకుపోవాల్సి వచ్చింది. తొలుత కేవలం స్టార్స్‌తో కలిసి పనిచేయాలి అనుకున్నా. ఆపై బడ్జెట్‌ సినిమాలకు సంతకం చేశా. ఈ క్రమంలోనే చిన్న సినిమాలకు కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది’ అని తెలిపారు.

ఇమేజ్‌ ఉండిపోయింది

అనంతరం ‘పవన్‌ కల్యాణ్‌ హీరోయిన్‌’ అనే ఇమేజ్‌ గురించి ఆమె మాట్లాడారు. ‘నేను తమిళ సినిమాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ.. తెలుగు వారు నన్ను ‘పవన్‌ కల్యాణ్‌ హీరోయిన్‌’ అనడం మాత్రం ఆపలేదు. కేవలం నా తొలి సినిమా ఆయనతో చేయడం వల్ల ఈ పేరు పెట్టేశారు’ అన్నారు.

మంచి నటిని చూస్తారు

అనంతరం యూకే, లాస్‌ఏంజెల్స్‌లో తనను క్యాస్టింగ్‌ డైరెక్టర్లు తిరస్కరించారంటూ దానికి కారణం చెప్పారు.. ‘నేను అతిగా నటించానని అక్కడి వారు అన్నారు. ఇంకా సహజంగా ఉంటూ భావాలు పలికించాలన్నారు. బాలీవుడ్‌ ఆఫర్ల కోసం వెళ్లినప్పుడు కూడా నాకు అవే మాటలు చెప్పారు. లండన్‌లో శిక్షణ తీసుకుంటున్నప్పటి నుంచి నన్ను నేను కొత్తగా చూసుకుంటున్నట్లుంది. ఇకపై దర్శకులు కచ్చితంగా నన్ను గొప్ప నటిగా చూస్తారు. ఆ నమ్మకం నాకుంది. ప్రస్తుతం లండన్‌లో టీవీ షోలు, సినిమాలకు ఆడిషన్స్‌ ఇస్తున్నా’ అని నికిషా పటేల్‌ ముగించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని