వాళ్లే నా జీవితం: పూజాహెగ్డే
close
Published : 02/04/2020 15:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాళ్లే నా జీవితం: పూజాహెగ్డే

ఆ ఉత్తరాలను బయటపెడతా..!

హైదరాబాద్‌: తనని ఎంతగానో ఆరాధించే తెలుగు అభిమానులే తన జీవితమని టాలీవుడ్‌ బుట్టబొమ్మ పూజాహెగ్డే అన్నారు. లాక్‌డౌన్‌లో భాగంగా సినిమా షూటింగ్స్ నిలిపివేయడంతో ఇంటికే పరిమితమైన పూజ తాజాగా తన ట్విటర్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. తన జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను పూజాహెగ్డే ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ చిన్నదాని సరదా ట్విటర్‌ చాట్‌ మీకోసం....

లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌, ఫొటోషూట్స్‌ను మీరు మిస్‌ అవుతున్నారా?

పూజాహెగ్డే: అవును! సెట్‌లో గడపటమనేది నా జీవితంలో ఎంతో సంతృప్తినిచ్చే విషయం. దాన్ని ఎంతో మిస్‌ అవుతున్నాను. కానీ, ప్రస్తుతం మనం జాగ్రత్తగా జీవించాలంటే ఇంట్లోనే ఉండాలి. ఇంట్లో ఉన్న ఈ సమయాన్ని నన్ను నేను పునర్న్మించుకోవడానికి ఉపయోగిస్తున్నాను.

సెలబ్రిటీ అయినప్పటి నుంచి మీ గురించి మీరు ఏం తెలుసుకున్నారు?

పూజాహెగ్డే: ఒకప్పటి కంటే ఇప్పుడు నేను మానసికంగా ధృడంగా ఉన్నాననే విషయాన్ని తెలుసుకున్నాను.

నాని గురించి ఒక్కమాటలో చెప్పగలరు?

పూజాహెగ్డే: తెలివైన నటుడు

స్కూల్‌ డేస్‌లో ఉన్నప్పుడు మీకు ఇష్టమైన సబ్జెక్ట్‌ ఏమిటి?

పూజాహెగ్డే: ఫిజిక్స్‌, ఇంగ్లీష్‌, టెక్నికల్‌ డ్రాయింగ్‌

మీకు స్ఫూర్తి ఎవరు?

పూజాహెగ్డే: ఎందరో మహిళలు నాలో స్ఫూర్తి నింపారు.  

తెలుగు అభిమానుల గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు?

పూజాహెగ్డే: నా జీవితం

షారుఖ్‌ గురించి మీ అభిప్రాయం?

పూజాహెగ్డే: కింగ్‌ ఆఫ్‌ రొమాన్స్‌

ముకుందా సినిమాలో ‘గోపికమ్మా’ అనే పాటలో మీ హావభావాలు ఎంతో బాగుంటాయి..!

పూజాహెగ్డే: నా కెరీర్‌ ఆరంభంలోనే అలాంటి మంచి సోలో సాంగ్‌ చేయడం నాకెంతో సంతోషంగా అనిపించింది. కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు నన్ను గోపికమ్మా అని పిలుస్తున్నారు.

‘బుట్టబొమ్మా’ సాంగ్‌లోని స్టెప్పులను ఎంతకాలం ప్రాక్టీస్‌ చేశారు?

పూజాహెగ్డే: కొన్ని సెకన్లు మాత్రమే

మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండడానికి కారణం ఏమిటి? 

పూజాహెగ్డే: హ్హహ్హహ్హ.. అది చాలా సింపుల్‌. నిజం చెప్పాలంటే క్లిష్ట పరిస్థితుల్లో కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటాను. మీరు సంతోషంగా ఉన్న పాత జ్ఞాపకాలను ఒక్కసారి గుర్తు చేసుకోండి. అలాగే మీరు కనుక వేరొకర్ని నవ్విస్తే.. మీరు సంతోషంగా ఉండడానికి అది ఉపయోగపడింది.

మీ జుట్టు బలంగా ఉండడానికి గల రహస్యం ఏమిటి?

పూజాహెగ్డే: కొబ్బరి నూనె

వింతగా అనిపించేలా మీరు చేసిన ఏదైనా పని చెప్పగలరు?

పూజాహెగ్డే: చిన్నప్పుడు నాకు శాంటా అంటే ఎంతో నమ్మకం ఉండేది. ఆయన గురించి కథలు విని.. ఆయనకి ఎన్నో ఉత్తరాలు కూడా రాశాను. ఏదో ఒకరోజు తప్పకుండా వాటిని మీతో పంచుకుంటాను.

మీకు ఇష్టమైన పాట?

పూజాహెగ్డే: మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ చిత్రంలోని మనసా మనసా అంటే ఇష్టం.

లాక్‌డౌన్‌లో మీ రోజువారీ జీవితం ఎలా గడుస్తోంది?

పూజాహెగ్డే: తినడం, నిద్రపోవడం, టీవీ చూడడం..

ఎక్కువగా ఉపయోగించే మొబైల్‌ యాప్స్‌ ఏమిటి?

పూజాహెగ్డే: ఇన్‌స్టా, వాట్సాప్‌

రజనీకాంత్‌ గురించి ఏమైనా చెప్పగలరు?

పూజాహెగ్డే: లెజెండ్‌

నటి కాకపోయి ఉంటే ఏ రంగంలో ఉండేవారు?

పూజాహెగ్డే: స్టైలిష్ట్‌, ఫొటోగ్రాఫర్‌

మీ అభిమాన గాయకుడు ఎవరు?

పూజాహెగ్డే: గాయకుడు, సంగీత దర్శకుడు ఏ.ఆర్‌.రెహమాన్‌. ఆయన మరో లెజెండ్‌

హృతిక్‌ గురించి మీ అభిప్రాయం?

పూజాహెగ్డే: ఎప్పటికీ ఆయనకి ఫిదా అవుతుంటాను. మనిషి, మనసు రెండూ అందంగా ఉంటాయి. చాలా అరుదుగా అలా ఉంటుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని