సెలబ్రిటీ అని పొగరు కదా! రిప్లై ఇవ్వరేం!
close
Published : 19/05/2020 09:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సెలబ్రిటీ అని పొగరు కదా! రిప్లై ఇవ్వరేం!

‘అందాల రాక్షసి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న అందాల భామ లావణ్య త్రిపాఠి. గతేడాది విడుదలైన ‘అర్జున్‌ సురవరం’ చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం సందీప్‌ కిషన్‌ నటిస్తున్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’, కార్తికేయతో ‘చావు కబురు చల్లగా’ చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా ట్విటర్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది.

మీ తొలి సినిమా షూటింగ్‌ సందర్భంగా జరిగిన క్రేజీ సంఘటన ఏదైనా ఉందా?

లావణ్య త్రిపాఠి: చాలా ఉన్నాయి. సినిమా బడ్జెట్‌ చాలా తక్కువ. అందుకే మాకు కారావ్యాన్‌లు ఉండేవి కావు. ప్రొడక్షన్‌ వ్యాన్‌లోపలే దుస్తులు మార్చుకునేవాళ్లం.

క్వారంటైన్‌లో మీరెలా ఉన్నారు?

లావణ్య త్రిపాఠి: నేను బాగానే ఉన్నాను. చాలా విసుగ్గా ఉంది. షూటింగ్స్‌ ఎప్పుడు మొదలవుతాయా? అని ఎదురు చూస్తున్నా.

మీ అభిమానుల గురించి చెప్పండి?

లావణ్య త్రిపాఠి: నా బలం

మీరు ఎలాంటి వారిని గుర్తు పెట్టుకుంటారు?

లావణ్య త్రిపాఠి: మంచి వ్యక్తులను, నిజమైన వారిని.

సినిమా ఇండస్ట్రీ అంటేనే పోటీ ప్రపంచం? ఇక్కడ సక్సెస్‌మంత్ర ఏంటి?

లావణ్య త్రిపాఠి: సక్సెస్‌ మంత్ర ఏంటో నాకూ తెలియదు. నిన్ను, నీ ధైర్యాన్ని నువ్వు నమ్ముకో. అదే విధంగా కళను కళగానే చూడాలి. పోటీలా చూడకూడదు.

పవన్‌కల్యాణ్‌ గురించి ఒక మాట చెప్పండి

లావణ్య త్రిపాఠి: అసమానతలకు ఎదురు నిలబడి పోరాటం చేస్తున్న ఆయన ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. నిజమైన హీరో

మీకు ఎప్పుడు గర్వంగా ఫీలవుతారు?

లావణ్య త్రిపాఠి: నా తల్లిదండ్రులు నన్ను గర్వంగా చూసినప్పుడు..

రామ్‌చరణ్‌ నటించిన చిత్రాల్లో మీకు ఇష్టమైనది ఏది?

లావణ్య త్రిపాఠి: ‘రంగస్థలం’ అంటే నాకు ఎంతో ఇష్టం.

లాక్‌డౌన్‌లో ఏం చేస్తున్నారు? ఏం నేర్చుకున్నారు?

లావణ్య త్రిపాఠి: వండుకోవడం.. తినడం..! నిశ్శబ్దంగా ఉండటం నేర్చుకున్నా.

మీరు నటి కావడానికి స్ఫూర్తి ఎవరు?

లావణ్య త్రిపాఠి: శ్రీదేవి మేడమ్‌, మాధురీ దీక్షిత్‌

షారుఖ్‌ సినిమాల్లో మీకు నచ్చింది?

లావణ్య త్రిపాఠి: చక్‌దే ఇండియా

అల్లు అర్జున్‌ ‘పుష్ప’ ఫస్ట్‌లుక్‌పై మీ అభిప్రాయం?

లావణ్య త్రిపాఠి: చంపేసింది. చూస్తుంటే బన్నికి మరో బ్లాక్‌బస్టర్‌ ఖాయం

మీరేదైనా వెబ్‌ సిరీస్‌ చూశారా? మాకు చెబుతారా?

లావణ్య త్రిపాఠి: ‘పాతాళ్‌లోక్‌’ చూశా. అద్భుతంగా ఉంది.

డీసీ, మార్వెల్‌ చిత్రాల్లో మీకు ఇష్టమైనవి ఏవి?

లావణ్య త్రిపాఠి: డీసీ నుంచి ‘జోకర్‌’, ‘బ్యాట్‌మెన్‌’ అంటే ఇష్టం. మార్వెల్‌ నుంచి వచ్చిన అన్ని సినిమాలూ ఇష్టమే..

మీరు త్వరలో ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’లో హాకీ ప్లేయర్‌గా నటిస్తున్నారు కదా? హాకీలో మెళకువలు ఏవైనా నేర్చుకున్నారా?

లావణ్య త్రిపాఠి: అవును నేర్చుకున్నా. సవాళ్లు అంటే నాకు చాలా ఇష్టం. అందుకే హాకీలో కొన్ని ట్రిక్స్‌ నేర్చుకున్నా.

లాక్‌డౌన్‌లో మీరు కొత్త నేర్చుకున్న నైపుణ్యం ఏంటి?

లావణ్య త్రిపాఠి: బ్యాడ్మింటన్‌ బాగా ఆడటం

స్కూల్లో మీ నిక్‌ నేమ్‌ ఏంటి?

లావణ్య త్రిపాఠి: లవ్‌, లావ్జ్‌, బార్బీ, సీత

మీ బ్యూటీ సీక్రెట్‌ ఏంటి?

లావణ్య త్రిపాఠి: మన మదిలో ఏదైతే ఫీలవుతామో అది మన ముఖంలో కనిపిస్తుంది.

మీ డ్రీమ్‌ రోల్‌ ఏంటి?

లావణ్య త్రిపాఠి: డ్రీమ్‌ రోల్‌ గురించి నాకు తెలియదు. కానీ, ‘చావు కబురు చల్లగా’లో మాత్రం నాది చాలా మంచి పాత్ర.

త్వరలో మీరు చేస్తున్న సినిమాలు

లావణ్య త్రిపాఠి: చావు కబురు చల్లగా, ఎ1 ఎక్స్‌ ప్రెస్‌, ఒక తమిళ మూవీ

చిత్ర పరిశ్రమపై కరోనా వైరస్‌ ప్రభావాన్ని మీరెలా చూస్తారు? లాక్‌డౌన్‌ తర్వాత మరో కొత్త ప్రపంచం వస్తుందా?

లావణ్య త్రిపాఠి: సమయం పడుతుంది. సమయం లేకుండా ఏదీ గొప్పగా రాదు

మీకు అత్యంత ఇష్టమైన ప్రదేశం ఏది?

లావణ్య త్రిపాఠి: నైనిటాల్‌

మీరు ఏ సినిమా షూటింగ్‌ను బాగా ఆస్వాదించారు?

లావణ్య త్రిపాఠి: భలే భలే మగాడివోయ్‌

సెలబ్రిటీ అని పొగరు కదా! అస్సలు రిప్లై ఇవ్వటం లేదు

లావణ్య త్రిపాఠి: పొగరు కాదు. చూడు ఎంతమందికి రిప్లై ఇచ్చానో..

సమంత గురించి ఒక మాటలో చెప్పండి.

లావణ్య త్రిపాఠి: అనేక విధాలుగా స్ఫూర్తినింపుతుంది. అద్భుతమైన నటి. సూపర్‌ ఉమెన్‌. ప్రతిసారీ తనకు తాను సవాళ్లు విసురుకుంటుంది.

వీరి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే..

చిరంజీవి: ఆయన్ని ఆరాధిస్తా. నేను కలిసిన వాళ్లలో వినయం, మంచితనం కలిగిన స్వీట్‌ పర్సన్‌

నాగార్జున: జీవితాన్ని ‘కింగ్‌’లా జీవించాలి. క్షమించాలి అంతకుమించి..

నాని: నా సహ నటుడు

ప్రభాస్‌: కూల్‌ పర్సన్‌

తారక్‌: అద్భుతమైన ఎనర్జీ ఆయన సొంతం. ‘ఆర్‌ఆర్ఆర్‌’లో ఆయన లుక్‌ కోసం మేమంతా వేచి చూస్తున్నాం.

వెన్నెల కిషోర్: మై క్రైమ్‌ పార్టనర్

రవితేజ: ఫన్నీ

వరుణ్‌తేజ్‌: సూపర్‌ టాలెంటెడ్‌

కీర్తి సురేశ్‌: అద్భుతమైన నటిమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని