'సర్కారు వారి పాట' థీమ్ అదే!
close
Updated : 02/06/2020 05:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

'సర్కారు వారి పాట' థీమ్ అదే!

‘నాకు క్రష్‌ ఉంది’.. అభిమానులతో ముచ్చట్లు

హైదరాబాద్‌: తన కుమారుడు గౌతమ్‌కి నటనపై ఆసక్తి ఉందని అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు అన్నారు. ఆయన తండ్రి సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ‘సర్కారు వారి పాట’ సినిమా పోస్టర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. పరశురామ్ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమా షూటింగ్‌ లాక్‌డౌన్‌ తర్వాత ప్రారంభం కాబోతోంది. కొత్త సినిమా ప్రకటించిన నేపథ్యంలో మహేశ్‌ ఆదివారం సాయంత్రం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ‘గౌతమ్‌ భవిష్యత్తులో హీరో అవుతాడా?’ అని అడగగా.. ‘అతడికి ఆసక్తి ఉంది. దాన్ని కాలం నిర్ణయిస్తుంది’ అని చెప్పారు. ఇలా మహేశ్‌కు, ఫ్యాన్స్‌కు మధ్య జరిగిన సంభాషణ చూద్దాం..

మీకిష్టమైన రంగు, ఆహారం, పానీయం ఏంటి?

మహేశ్‌: నాకు ‘బ్లూ’ ఇష్టం. ఐ లవ్‌ హైదరాబాద్‌ బిర్యానీ. కాఫీ ఎక్కువ తాగుతా.

కుటుంబ సభ్యులతో కలిసి క్వారంటైన్‌లో ఉండటం ఎలా ఉంది?

మహేశ్‌: ఇది ఓ అందమైన అనుభవం. వాళ్లతో కలిసి ఎన్నో పనులు చేశా, సరదాగా సమయం గడిపా. పనిలో ఉన్నప్పుడు ఇలా ఉండలేను.

మీ సినిమా ఎప్పుడు విడుదల కాబోతోంది?

మహేశ్‌: పరిస్థితులు చక్కబడి, తిరిగి షూటింగ్స్‌ ప్రారంభం అవుతాయని ఆశిస్తున్నాం. త్వరలోనే మీకు సినిమా గురించి చెబుతాం.

షూటింగ్స్‌ మిస్‌ అవుతున్నారా?

మహేశ్‌: కచ్చితంగా.

మీ పిల్లలకు మీరు వండిపెట్టగలిగే ఆహారం?

మహేశ్‌: మ్యాగీ నూడిల్స్‌

ఏంటి అన్నయ్య.. నువ్వు అబ్బాయిలకు రిప్లై ఇవ్వడం లేదు?

మహేశ్‌: హాయ్‌ దిల్లీ.. నీ ఆదివారం ఎలా గడిచింది.

మీకు స్ఫూర్తి ఎవరు?

మహేశ్‌: మా నాన్న

నన్ను పేరు పెట్టి పిలవండి?

మహేశ్‌: హాయ్‌ మూర్తి

సర్‌.. నమ్రత మేడమ్‌పై మీకెంత ప్రేముంది?

మహేశ్‌: నీకు పెళ్లైందా?? ముందు నాకు సమాధానం చెప్పు (నవ్వుతున్న ఎమోజీ)

మీకు రష్మిక నటన నచ్చిందా? సమంత నటనా?

మహేశ్‌: నాకు ఇద్దరి నటనా నచ్చింది. అమేజింగ్‌ సహ నటీమణులు

మీరు అంత హ్యాండ్సమ్‌గా ఉండటం వెనుక రహస్యం ఏంటి?

మహేశ్‌: నీ ప్రశంసకు ధన్యవాదాలు. ఇలా ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటం కోసం నేను చాలా కష్టపడుతుంటా

మీ తండ్రి గురించి ఒక్క మాటలో చెప్పండి?

మహేశ్‌: ఆయన గురించి చెప్పడానికి ఒక్క మాట సరిపోదు

ఈ క్వారంటైన్‌ మీ జీవన శైలిని మార్చిందా? మీ రోజువారి జీవితంపై ఎలాంటి ప్రభావం చూపింది?

మహేశ్‌: ఇది నా జీవన శైలిని మార్చలేదు. నేను ఎప్పటిలాగే ఉన్నా. తొందరగా నిద్రపోయి.. ఉదయాన్నే నిద్రలేచే వ్యక్తిని నేను

మీరు ఇంత అంకితభావంతో ఎలా ఉంటారు?

మహేశ్‌: ప్రతిదీ పర్‌ఫెక్ట్‌గా ఉండాలి అనుకునే నా ఆలోచనల వల్ల

మీకిష్టమైన ఆట ఏది సర్‌?

మహేశ్‌: నాకు టెన్నిస్‌, గోల్ఫ్‌ ఆటలు ఇష్టం. నా కుమారుడు గౌతమ్‌తో కలిసి ఆన్‌లైన్‌లో బేస్‌బాల్‌ ఆడుతుంటా

ఇప్పుడు మీ ఇద్దరు పిల్లలు ఏం చేస్తున్నారు?

మహేశ్‌: ఇద్దరు తమ స్నేహితులతో కలిసి వీడియో గేమ్స్‌ ఆడుతున్నారు

హాయ్‌ సర్‌.. నా పేరు మణి.. మిమ్మల్ని జేమ్స్‌బాండ్‌ తరహా సినిమాలో చూడాలని ఉంది. భవిష్యత్తులో మీ నుంచి అలాంటి చిత్రాన్ని ఆశించొచ్చా?

మహేశ్‌: మణి వీలైతే స్క్రిప్టు సిద్ధం చేసి, నాకు పంపండి. అలాంటి సినిమా చేయడం నాకూ ఇష్టమే.

మిమ్మల్ని ఎలా గుర్తుంచుకోవాలి అనుకుంటున్నారు?

మహేశ్‌: ఓ గొప్ప నటుడిగా, నా పిల్లలకు మంచి తండ్రిగా, నా భార్యకు గొప్ప భర్తగా.. గుర్తుంచుకోవాలి

సర్‌.. మీరు బాలీవుడ్‌ సినిమాలో నటించరా?

మహేశ్‌: మీరు ఏం అనుకుంటున్నారు?

మీ కొత్త సినిమాలో హీరోయిన్‌ ఎవరు?

మహేశ్‌: ఎవరై ఉండొచ్చు..

భవిష్యత్తులో పూరీతో కలిసి సినిమా చేస్తారా? మేం ఎదురుచూస్తున్నాం.

మహేశ్‌: కచ్చితంగా ఆయన దర్శకత్వంలో నటిస్తా. నాకు ఇష్టమైన దర్శకుల్లో పూరీ ఒకరు. ఆయన కథ నరేట్‌ చేస్తారేమో అని ఇప్పటికీ ఎదురుచూస్తున్నా

నాకు హాయ్‌ చెప్పు మహేశ్‌.. లేకపోతే ఏడుస్తా.

మహేశ్‌: ప్లీజ్‌.. కన్నీరుపెట్టుకోకు. నా నుంచి నీకు బిగ్‌ హగ్‌ ఇస్తున్నా!

వర్షం పడుతోంది. వాతావరణం చాలా బాగుంది. ఇలాంటి సమయంలో ఏ స్నాక్‌ తినడానికి ఇష్టపడతారు?

మహేశ్‌: మిర్చీ బజ్జీ.. వేడివేడి అల్లం టీ.

కర్ణాటక అభిమానుల గురించి ఒక్కమాట?

మహేశ్‌: సూపర్‌ కూల్‌.

నా మెసేజ్‌లు చదవండి.. మూడు గంటల నుంచి ఎదురుచూస్తున్నా.

మహేశ్‌: హలో..

నమస్కారం సర్‌.. వేలం పాట డేట్‌ ఎప్పుడు?

మహేశ్‌: నాకు తెలిసిన తర్వాత మీకూ తెలుస్తుంది.

రాజమౌళితో మీ సినిమా వస్తుంది అనుకోవచ్చా?

మహేశ్‌: కచ్చితంగా.. నేనూ రాజమౌళితో కలిసి పనిచేసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా.

మీరు పుస్తకాలు చదువుతారా? మీకు ఇష్టమైన పుస్తకం ఏంటి?

మహేశ్‌: చదువుతా మాధవి.. తాజాగా Sapiens పూర్తి చేశా.

మీకిష్టమైన మార్వెల్‌ హీరో?

మహేశ్‌: ఐరన్‌మాన్‌, హల్క్‌.

మీకు క్రష్‌ ఉన్నారా?

మహేశ్‌: 26 ఏళ్ల వయసులో నాకు క్రష్‌ ఏర్పడింది. ఆ తర్వాత ఆమెను (నమ్రత) పెళ్లి చేసుకున్నా

మీ బామ్మ వండే మీకిష్టమైన ములక్కాయ మటన్‌ గురించి చెప్పండి?

మహేశ్‌: ఇప్పుడు దాన్ని గుర్తు చేయొద్దు.

మీరు, మీ కుమారుడు ఒకే హైట్‌ ఉన్నారా?

మహేశ్‌: అతడు ఎదుగుతున్నాడు.. ఎప్పుడైనా నా హైట్‌ను చేరుకోవచ్చు.

మైండ్‌ బ్లాక్‌ పాటకు డేవిడ్‌ వార్నర్‌ డ్యాన్స్‌ చేసినప్పుడు ఎలా ఫీల్‌ అయ్యారు?

మహేశ్‌: ఆయన అద్భుతం.

నాకు, మా అమ్మకు మీ చిత్రాలంటే చాలా ఇష్టం. మీ సినిమాల్ని కలిసే చూస్తాం.

మహేశ్‌: స్వీట్‌.. మీ అమ్మకు నేను హాయ్‌ చెప్పినట్లు చెప్పండి.

సితార పాపకు నేను హాయ్‌ చెప్పినట్లు తెలపండి?
మహేశ్‌: చెబుతా.. ఇప్పుడు ఆమె బిజీగా ఉన్నట్లున్నారు.

సితార.. గౌతమ్‌.. మీకు ఎవరు ఎక్కువ ఇష్టం?

మహేశ్‌: ఇద్దరూ నాలో భాగమే. వారిని తక్కువ ప్రేమించడం ఎలా?

సర్కారు వారి పాట’ థీమ్‌ ఏంటి సర్‌?

మహేశ్‌: బలమైన సందేశంతో కూడిన ఎంటర్‌టైనర్‌. నిజంగా ఈ సినిమా విషయంలో ఉత్సుకతగా ఉన్నా.

మీ స్వస్థలం బుర్రిపాలెంకు ఓసారి రండి.. ఇక్కడ మిమ్మల్ని చూడాలని ఉంది.

మహేశ్‌: త్వరలోనే వస్తా.

సర్‌ నేను చచ్చిపోయేలా ఉన్నా.. నా పేరుతో హాయ్‌ చెప్పండి.. నాది యూఎస్‌ఏ.

మహేశ్‌: హాయ్‌ సాయి.. దయచేసి ఇంట్లోనే సురక్షితంగా ఉండండి. లాట్స్‌ ఆఫ్‌ లవ్‌.

మీకు ఇష్టమైన వర్కౌట్‌ ఏంటి?

మహేశ్‌: ఫంక్షనల్‌ అండ్‌ లెగ్‌ వర్కౌట్‌.

మీ బెస్ట్‌ ఫ్రెండ్‌ ఎవరు?

మహేశ్‌: నమ్రత.

ఫ్రీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు?

మహేశ్‌: పుస్తకాలు చదువుతా. సినిమాలు చూస్తా. స్విమ్మింగ్‌ చేస్తా.. నా పిల్లలు, పెంపుడు జంతువులతో ఆడుకుంటా. ఇలా చాలానే ఉన్నాయి.

ఇలా మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతుంటే మా గురించి ఏం అనుకుంటున్నారు?

మహేశ్‌: చాలా సంతోషంగా ఉన్నా. మీతో మాట్లాడటం ఎంతో ఆనందంగా ఉంది.

మీ ఫ్యాన్స్‌ గురించి చెప్పండి?

మహేశ్‌: ఇప్పటికే మీ గురించి చెప్పా.. మళ్లీ చెబుతున్నా. మీ ప్రేమ, ఆదరణ వల్లే ఈ స్థాయిలో ఉన్నా. మీ అందరి కోసం నా నుంచి ది బెస్ట్‌ ఇవ్వడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తా. మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నా. ఇలాంటి కష్ట సమయాల్లో ఇంట్లోనే ఉండండి. దేవుడి ఆశీర్వాదాలు మీకెప్పుడూ ఉంటాయి.

మీ ముద్దుపేరు ఏంటి?

మహేశ్‌: నాని.

మీకిష్టమైన క్రికెటర్‌ ఎవరు?

మహేశ్‌: ఎమ్‌.ఎస్‌. ధోనీ, విరాట్‌ కోహ్లీ.. ఆల్‌ టైమ్‌ ఫేవరెట్‌ సచిన్‌.

మీకు వెబ్‌ సిరీస్‌లు ఇష్టమేనా?

మహేశ్‌: తాజాగా defending jacob పూర్తి చేశా. చాలా ఆసక్తికరంగా ఉంది.

మీ గురించి ఓ రహస్యం?

మహేశ్‌: అది రహస్యం.. మీకెలా చెబుతా (నవ్వుతూ)

మీ పెంపుడు కుక్కల పేర్లు?

మహేశ్‌: నోబితా, ప్లూటో..

మీకిష్టమైన జంక్‌ ఫుడ్‌?

మహేశ్‌: బర్గర్‌, పిజ్జా.

ఐ లవ్‌ యూ.. కేరళ నుంచి మీ అభిమానిని.

మహేశ్‌: నీకు నా ప్రేమను తిరిగి పంపుతున్నా

లాక్‌డౌన్‌ తర్వాత జీవితం ఎలా ఉంటుందని అనుకుంటున్నారు?

మహేశ్‌: లాక్‌డౌన్‌ తర్వాత జీవితం వేరుగా ఉంటుంది. మాస్కులు ధరించాలి, జాగ్రత్తగా ఉండాలి. మనమంతా మార్పును స్వీకరించాలి.

 

 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని