ఆ చిత్రాన్ని ఏడు సార్లు తిరస్కరించా
close
Published : 05/06/2020 20:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ చిత్రాన్ని ఏడు సార్లు తిరస్కరించా

తొలి చిత్రం ‘మైనే ప్యార్‌ కియా’తోనే బాలీవుడ్‌తో పాటు తెలుగు ప్రేక్షకుల గుండె గూటిలో ప్రేమ పావురంగా వాలిపోయింది భాగ్యశ్రీ. ‘ప్రేమ పావురాలు’తో పలకరించిన 30 ఏళ్ల తర్వాత మళ్లీ భాగ్యశ్రీ తెలుగు తెరపై అలరించడానికి సిద్ధమైంది. ప్రభాస్‌ చిత్రంలో ముఖ్య పాత్రలో కనిపించనున్న ఆమె ‘ఈనాడు సినిమా’తో చెప్పిన ముచ్చట్లివీ.

ఇప్పటికీ నన్ను తెలుగు వారు ‘ప్రేమపావురాలు’ నాయికగా గుర్తుంచుకున్నారు. ప్రభాస్‌ నటనకు పెద్ద అభిమానిని. అందుకే ప్రభాస్‌ సినిమాను అంగీకరించాను. ఇన్నేళ్ల తర్వాత తెలుగు  ప్రేక్షకుల ముందుకు వస్తుండటం ఉద్వేగంగా ఉంది.


ప్రభాస్‌ ఎంత ఎదిగినా వినయంగా ఉంటాడు. ఇద్దరం ఫుడ్‌ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం. తొలిరోజు నేను సెట్‌కు వెళ్లగానే నన్ను చూసి ఎదురొచ్చాడు. తను నాకు అభిమాని అని చెప్పాడు. ప్రభాస్‌తో కలిసి నటిస్తున్నందుకు చాలా సంతోషంగాఉంది.

రాజవంశీకుల కుటుంబంలో పుట్టిన నాకు అమెరికాలో ఉన్నత విద్య చదవాలని ఉండేది. మా పక్కింట్లో ఉండే బాలీవుడ్‌ దర్శకుడు అమోల్‌ పాలేకర్‌ తాను తీస్తున్న  ఓ టీవీ సీరియల్‌లో ప్రధాన పాత్రకు నన్ను ఎంపిక చేసుకున్నారు. అలా నటినయ్యా. అయిష్టంగానే ‘మైనే ప్యార్‌ కియా’: నా జీవితాన్ని మార్చేసిన సినిమా ‘మైనే ప్యార్‌ కియా’. అందులో నటించడం నాకు ఇష్టముండేది కాదు. సినిమాల్లోకి వెళితే అమెరికాలో చదువుకోవాలన్న లక్ష్యం దెబ్బతింటుందని భయపడేదాన్ని. ఆ చిత్ర దర్శకుడు సూరజ్‌ బర్జాత్యా నాన్నకు స్నేహితుడు. సల్మాన్‌ ఖాన్‌కు నాయికగా నేనైతే బాగుంటుందని అనుకున్నారట. నాన్నను ఒప్పించగలిగారు కానీ నేను ఇష్టపడలేదు. అయినా సూరజ్‌గారు ప్రయత్నించడం మానలేదు. దీంతో ఈ చిత్రం నుంచి ఎలా తప్పించుకోవాలా? అని ఆలోచించా. ఆయనను కథంతా చెప్పమనేదాన్ని. ఆ తర్వాత ఫలానా సీన్‌ బాగోలేదు. మారిస్తే మంచిది అనేదాన్ని. ఆయన మరో రోజు ఆ సీన్‌ను మార్చి తీసుకొచ్చేవారు. తిరిగి నేను మరో సీన్‌ను మార్చమనేదాన్ని. అలా ఏడుసార్లు ఆ సినిమాను తిరస్కరించడానికి ప్రయత్నించా. చివరికి వేరే దారిలేక ఒప్పుకొన్నా. తొలి సినిమా ఘన విజయం సాధించాక మరికొన్ని సినిమాల్లో నటించా. అయితే సినిమాల కన్నా నేను ఎక్కువ ప్రేమించిన చిన్నప్పటి స్నేహితుడు హిమాలయ దసానీని పెళ్లిచేసుకుని తెరకు దూరమయ్యా. ఒక బాబు, పాపతో కుటుంబ జీవితాన్ని ఆస్వాదించా. మహారాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘భాగ్యశ్రీ స్కీం’ ప్రాజెక్టు ప్రచారకర్తగా బాలికల చదువు ప్రాముఖ్యత గురించి ప్రచారం చేయడం సంతృప్తినిచ్చింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని