‘రామాయణ్‌’ రావణుడు ఇకలేరు
close
Published : 07/10/2021 03:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘రామాయణ్‌’ రావణుడు ఇకలేరు

రావణుడిగా నటించి దేశవ్యాప్తంగా ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్న నటుడు అరవింద్‌ త్రివేది (82) తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి గుండెపోటుతో ముంబయిలోని తన స్వగృహంలో కన్నుమూశారు. ప్రముఖ దర్శకుడు రామానంద్‌ సాగర్‌ తెరకెక్కించిన ‘రామాయణ్‌’ సీరియల్‌లో రావణుడి పాత్ర పోషించి ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయారు అరవింద్‌ త్రివేది. ఆయన హిందీ, గుజరాతి భాషల్లో 300పైగా సినిమాల్లో వివిధ రకాల పాత్రల్లో    నటించారు. ఆయన నటించిన ‘విక్రమ్‌ ఔర్‌ బేతాళ్‌’ ధారావాహికతోపాటు గుజరాతీ చిత్రం ‘దేశ్‌ రే జోయా దాదా పర్దేశ్‌ జోయా’ చిత్రం ఆయనకు మంచి పేరు తెచ్చాయి. అరవింద్‌ ఎంపీగానూ బాధ్యతలు నిర్వర్తించారు. ‘రామాయణ్‌’ సీరియల్‌ను మొదటి లాక్‌డౌన్‌ సమయంలో దూరదర్శన్‌ తిరిగి ప్రసారం చేసింది. కోట్లాది మంది దీన్ని వీక్షించారు.

ప్రధాని సంతాపం: అరవింద్‌ త్రివేది మృతిపట్ల దేశ ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటిస్తూ ట్వీట్‌ చేశారు. ‘‘అరవింద్‌ గొప్ప నటుడు మాత్రమే కాదు. మంచి ప్రజా సేవకుడు. ‘రామాయణ్‌’ సీరియల్‌తో ఆయన ఎన్నో తరాల వారికి గుర్తుండిపోతారని’’ అన్నారు మోదీ. ఆయన మరణ వార్త తమను ఎంతో కలచివేసిందని సామాజిక మాధ్యమాల ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు అరుణ్‌ గోవిల్‌, సునీల్‌ లహ్రీ. ఈ ఇద్దరూ ‘రామాయణ్‌’లో రామలక్ష్మణులుగా నటించారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అరవింద్‌ మృతికి సంతాపం తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని