‘యాక్షన్‌ హీరో’ ఆయుష్మాన్‌
close
Updated : 10/10/2021 04:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘యాక్షన్‌ హీరో’ ఆయుష్మాన్‌

వైవిధ్యమైన పాత్రలతో ప్రయాణం చేస్తూ దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న నటుడు ఆయుష్మాన్‌ ఖురానా. తాజాగా ఆయన నుంచి మరో కొత్త చిత్రం రాబోతుంది. ప్రముఖ దర్శకనిర్మాత ఆనంద్‌ ఎల్‌రాయ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ‘యాక్షన్‌ హీరో’ అనే పేరుని ఖరారు చేస్తూ ఓ ప్రత్యేక టీజర్‌ను విడుదల చేశారు. అనిరుధ్‌ అయ్యర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఆయుష్మాన్‌ మాట్లాడుతూ ‘‘ఆనంద్‌ సార్‌తో మూడోసారి కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. ఓ కొత్త పంథాలో సాగే కథ ఇది’’అన్నారు. ‘‘ఈ తరహా కథ రావడం ఇదే తొలిసారి, ఆయుష్మాన్‌తో కలిసి పనిచేయడం మూడోసారి. ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి ఆసక్తిగా ఉన్నాం’’అని చెప్పారు ఆనంద్‌ ఎల్‌రాయ్‌. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎక్కువ భాగం అమెరికాలో చిత్రీకరించనున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని